బీఆర్ఎల్ ఎండీగా కిషోర్ బియానీ | Kishore Biyani appointed Bharti Retail managing director | Sakshi
Sakshi News home page

బీఆర్ఎల్ ఎండీగా కిషోర్ బియానీ

May 3 2016 5:56 PM | Updated on Sep 3 2017 11:20 PM

ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బియానీని భారతీ రిటైల్ లిమిటెడ్(బీఆర్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది.

ముంబై : ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బియానీని భారతీ రిటైల్ లిమిటెడ్ (బీఆర్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది. భారతీ గ్రూప్స్ రిటైల్ బిజినెస్ తో పునర్ వ్యవస్థీకరణ పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అయితే ఎఫ్ఆర్ఎల్ బోర్డు సభ్యుడిగా బియానీ కొనసాగుతారని కంపెనీ తెలిపింది.

బీఆర్ఎల్ తో వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కు జాయింట్ డైరెక్టర్ గా ఉన్న రాకేష్ బియానీ కూడా బీఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ మిట్టల్ కంపెనీ బోర్డు డైరెక్టర్లలో సభ్యుడిగా కొనసాగనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement