
న్యూఢిల్లీ: మోటోరాయల్,కైనిటిక్ గ్రూప్‌ల మల్టీ–బ్రాండ్ సూపర్‌బైక్స్ వెంచర్ నుంచి అధునాతన ‘ఎంవీ అగస్టా డ్రాగ్‌స్టర్ సిరీస్’ విడుదలైంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ సూపర్‌బైక్స్ బుధవారం అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ‘డ్రాగ్‌స్టర్ 800 ఆర్‌ఆర్’, ‘డ్రాగ్‌స్టర్ 800 ఆర్‌ఆర్ అమెరికా’ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 18.73 లక్షలు కాగా.. ‘డ్రాగ్‌స్టర్ 800 ఆర్‌ఆర్ పిరెల్లి’ ట్రిమ్ ధర రూ. 21.5 లక్షలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా మోటోరాయల్ మేనేజింగ్ డైరెక్టర్ అజిన్‌క్య ఫిరోడియా మాట్లాడుతూ.. ‘ఇక్కడి రహదారి పరిస్థితులకు అనుగుణంగా ఉండే, ఆకర్షణీయ కొత్త సూపర్‌బైక్స్ విడుదలచేశాం. తాజా వేరియంట్లు కూడా మునుపటి మోడళ్ల మాదిరిగా విజయవంతం అవుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు.