కియా ‘సెల్టోస్‌’ విడుదల ఈ నెల 8న | Kia Invite to YS Jagan Mohan Reddy For Launching Seltos | Sakshi
Sakshi News home page

కియా ‘సెల్టోస్‌’ విడుదల ఈ నెల 8న

Aug 6 2019 12:35 PM | Updated on Aug 6 2019 12:35 PM

Kia Invite to YS Jagan Mohan Reddy For Launching Seltos - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కియా ‘సెల్టోస్‌’ విడుదల కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న కంపెనీ ప్రతినిధులు

సాక్షి, అమరావతి: దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా కంపెనీ తన కొత్తకారు ‘సెల్టోస్‌’ను ఈ నెల 8న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కియా కంపెనీ ఎండీ కూక్‌ హున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ సోమవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి అనంతపురం జిల్లా పెనుగొండలో నిర్వహించే కొత్త కారు విడుదల కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షలకార్లను పెనుగొండ ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్‌లో 7 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. సెల్టోస్‌ విడుదల కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement