జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

JSPL Posts Net Loss Of Rs 399 Cr For Sept Quarter - Sakshi

న్యూఢిల్లీ: జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌(జేఎస్‌పీఎల్‌) కంపెనీకి రెండో త్రైమాసిక కాలంలో రూ.399 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.279 కోట్ల నికర లాభం వచ్చిందని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,983 కోట్ల నుంచి రూ.8,940 కోట్లకు తగ్గిందని పేర్కొంది.  ధరలు, లాభదాయకత బాగా తగ్గినా, రెయిల్స్, ప్లేట్స్‌ వంటి విభిన్నమైన విలువాధారిత ఉత్పత్తుల తోడ్పాటుతో ఒకింత ఊరట లభించిందని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి  రుణ భారం రూ.36,501 కోట్లుగా ఉందని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top