జేఎల్‌ఆర్‌కు ట్రేడ్‌వార్‌ సెగ

JLR July sales down 21.6% at 36144 units - Sakshi

 భారీగా తగ్గిన అమ్మకాలు

జూలైలో 21.6 శాతం క్షీణత

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు జూలైలో భారీ క్షీణతను నమోదుచేశాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ బ్రౌటిగమ్‌ తెలిపారు. జాగ్వార్‌ బ్రాండ్‌ సేల్స్‌ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు 24 శాతం క్షీణించి 25,152 యూనిట్లుగా నిలిచినట్లు వెల్లడించారు.

‘కీలక మార్కెట్లలో గత నెల అమ్మకాలు క్లిష్టతరంగా మారాయి. చైనాలో రిటైల్‌ సేల్స్‌ 46.9 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తేలికపాటి వాహన పరీక్షా విధానంలో జాప్యం వల్ల బ్రిటన్‌లో అమ్మకాలు 18.3 శాతం తగ్గాయి. ఉత్తర అమెరికాలో 9.5 శాతం తగ్గుదల నమోదైంది. టారిఫ్‌ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని వివరించారు. వాణిజ్య యుద్ధం కారణంగా కొనుగోలుదారుల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారాయన.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top