అద్భుత ఫీచర్లతో జియో ఫోన్‌-3 వస్తోంది!

JioPhone 3 launch expected on August 12  - Sakshi

ఆగస్టు 12 న  జియో ఫీచర్‌ ఫోన్‌ 3

జియో గిగా ఫైబర్‌ సేవలతో పాటు ఇది లాంచ్‌ కావచ్చని అంచనా

సాక్షి, ముంబై :  టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో  జియోగిగా ఫైబర్‌ సేవలను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది.  సుదీర్ఘం కాలం పరీక్షల  అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా  కమర్షియల్‌గా లాంచ్‌  చేయనుంది.  ఈ సందర్భంగా  జియో తన కస్టమర్లకు మరో గుడ్‌ న్యూస్‌ కూడా చెప్పింది.  జియో గిగా ఫైబర్‌తో పాటు  జియోఫోన్ 2 కి కొనసాగింపుగా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో జియో ఫీచర్‌ ఫోన్‌ 3 ని తీసుకురానుంది.  జియోఫోన్‌ 2 కంటే  ఆకర్షణీయ  ఫీచర్లతో, దాదాపు అన్ని అంశాలలో మరింత శక్తివంతంగా  తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. 

జియో ఫోన్‌3 ఫీచర్ల పై అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ మైస్‌మార్ట్‌ప్రైస్  నివేదిక  ప్రకారం  4జీ టెక్నాలజీతో జియోఫోన్ 3 మీడియాటెక్ చిప్‌సెట్‌తో రానుంది. 5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో, పవర్‌ఫుల్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్‌ 3ని ఆవిష్కరించనుంది. 2జీబీ ర్యామ్‌, 64 స్టోరేజ్‌ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని  అంచనా. అంతేకాదు  5 ఎంపీ రియర్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top