జియోఫోన్‌ 2 ఫీచర్లు ఇవే!

JioPhone 2 Launched: Specs, Price, Top features - Sakshi

ముంబై : ప్రస్తుతం ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న జియోఫోన్‌కు సక్ససర్‌గా హై-ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. పాత ఫోన్‌కు స్మార్టర్‌గా ఈ కొత్త జియోఫోన్‌ 2ను మార్కెట్‌లోకి వచ్చింది. అత్యాధునిక స్పెషిఫికేషన్లు, మెరుగైన డిజైన్‌తో జియోఫోన్‌ 2ను రిలయన్స్‌ రూపొందించింది. 25 మిలియన్‌ పాత జియోఫోన్లను విక్రయించినట్టు ప్రకటించిన అనంతరం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా, కొడుకు ఆకాశ్‌ జియోఫోన్‌ 2ను లాంచ్‌ చేశారు.  
జియోఫోన్‌ 2 స్పెషిఫికేషన్లు..
డిస్‌ప్లే : అంతకముందు జియోఫోన్‌కు ఉన్న డిస్‌ప్లే మాదిరిగానే 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే. కీప్యాడ్‌ ఏరియాలో మార్పు. బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌
సాఫ్ట్‌వేర్‌ : జియోఫోన్‌ 2,  అమెరికా కంపెనీ కిఓఎస్‌ టెక్నాలజీస్‌ చెందిన కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది
ర్యామ్‌ : 512 ఎంబీ ర్యామ్‌
స్టోరేజ్‌ : 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ
బ్యాటరీ : 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
కనెక్టివిటీ : వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో
వెనుక కెమెరా : 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌
ముందు కెమెరా : వీజీఏ సెన్సార్‌ 

స్పెషల్‌ ఫీచర్లు...
క్వర్టీ కీప్యాడ్‌ కొత్త జియోఫోన్‌ 2లో కీలక ఫీచర్‌. జియోఫోన్‌తో పోలిస్తే మొత్తం డిజైన్‌ను రిలయన్స్‌ మార్చింది. జియోఫోన్‌ బేసిక్‌ ఫీచర్‌ ఫోన్‌ మాదిరి ఉంటే, జియోఫోన్‌ 2 ఎంట్రీ-లెవల్‌ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్‌ వెర్షన్‌ జియోఫోన్‌ 2గా కంపెనీ అభివర్ణించింది. జియోఫోన్‌ 2 డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్‌ కార్డు స్లాట్‌ లాక్‌ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్‌ కోసమే రూపొందించారు. రెండో సిమ్‌ కార్డు స్లాట్‌​ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు. 

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ పాపులర్‌ సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్స్‌ను ఈ ఫోన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 15 నుంచి జియోఫోన్‌ 2 విక్రయాలు కమర్షియల్‌గా ప్రారంభమవుతాయి. జియోఫోన్‌ 2 లో కూడా ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేసుకోవచ్చు. 

జియోఫోన్‌  కోసం మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ముఖేష్‌ అంబానీ తెలిపారు. ఈ ఆఫర్‌ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్‌ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. ఈ ఆఫర్‌ జూన్‌ 21 నుంచి ప్రారంభమవుతుంది. 
జియోఫోన్‌ 2 ధర : రూ.2999కే ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. బ్లాక్‌ రంగులో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది. జియోఫోన్‌ 2 రిటైల్‌ పార్టనర్లు ఎవరన్నది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించలేదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top