మళ్లీ జియోనే టాప్‌!!

Jio Tops 4G Download Speed Chart - Sakshi

న్యూఢిల్లీ : ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఛార్ట్‌లో మళ్లీ రిలయన్స్‌ జియోనే ముందంజలో నిలిచింది. ఆగస్టు నెలలో 22.3 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడుతో, అత్యంత వేగవంతమైన 4జీ ఆపరేటర్‌గా జియో నిలిచినట్టు ట్రాయ్‌ డేటా వెల్లడించింది. జియో డౌన్‌లోడ్‌ పరంగా దూసుకెళ్లగా.. ఐడియా సెల్యులార్‌ కంపెనీ హయ్యస్ట్‌ అప్‌లోడ్‌ స్పీడు నెట్‌వర్క్‌గా నిలిచినట్టు ట్రాయ్‌ రిపోర్టు తెలిపింది. జియో సగటు 4జీ డౌన్‌లోడ్‌ స్పీడులో, తన ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ కంటే రెండింతలు ముందంజలో ఉంది. 

సెకనుకు 10 మెగాబిట్స్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను జియో నమోదు చేసినట్టు ట్రాయ్‌ తన మైస్పీడ్‌ పోర్టల్‌లో ప్రచురించింది. అదేవిధంగా ఐడియా 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఫ్లాట్‌గా 6.2 ఎంబీపీఎస్‌గానే ఉంది. వొడాఫోన్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ జూలై నెలలో 6.4 ఎంబీపీఎస్‌గా ఉండగా.. ఆగస్టు నెలలో 6.7 ఎంబీపీఎస్‌కు పెరిగింది. ఐడియా 4జీ అప్‌లోడ్‌ స్పీడ్‌లో 5.9 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో ఉంది. వీడియోలను చూడటానికి, నెట్‌ బ్రౌజ్‌ చేయడానికి, ఈమెయిల్స్‌ను యాక్సస్‌ చేసుకోవడంలో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top