జియో బంపర్‌ ప్లాన్‌: ఫ్రీ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌

Jio To Launch Postpaid Services With Unlimited Benefits At Rs 199/ Month - Sakshi

సాక్షి,ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్  తన  కస్టమర్లకు  మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్‌ పోస్ట్‌ పెయిడ్‌ సర్వీసులను  ప్రకటించింది.  ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటర్నేషనల్‌ కాలింగ్‌ యాక్టివేషన​ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలాంటి  నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే  అంతర్జాతీయ కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.

రిలయన్స్‌ జియో కొత్త పోస్ట్‌పెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌ లో నెలకు 199రూపాయల ప్యాక్‌లో 25జీబీ డేటాని ఆఫర్‌ చేస్తోంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను కల్పిస్తున్న  ఈ ప్లాన్‌ మే 15నుంచి  అమల్లోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో జియో తెలిపింది.  ముఖ్యంగా ఈ ప్యాక్‌ద్వారా జియో వినియోగదారులందరికీ అత్యంత ఆకర్షణీయమైన,  ఇంటర్నేషనల్‌  కాలింగ్‌ అండ్‌  రోమింగ్‌  సౌలభ్యాన్నికూడా అందుబాటులోకి తెస్తున‍్నట్టు  వెల్లడించింది.  అంతర్జాతీయ కాలింగ్ నిమిషానికి 50 పైసలు నుంచి మొదలవుతుందని పేర్కొంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌, సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top