మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

Jio GigaFiber to Launch Commercial on August 12 Report - Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి  సిద్ధమవుతోంది. టెలికాం చరిత్రలో జియో ఎంట్రీతోడేటా విప్లవానికి నాంది పలికిన సంస్థ  ‘జియో గిగా ఫైబర్‌’ పేరుతో సూపర్‌ ఫాస్ట్‌ ఇంటర్నెట్‌ సేవల ఆవిష్కారానికి రంగం సిద్ధం చేసింది. హై-స్పీడ్ ఫైబర్-టు-హోమ్ (ఎఫ్‌టిటిహెచ్) జియో గిగా ఫైబర్ ఆగస్టు 12న కమర్షియల్‌గా లాంచ్‌ చేయనుందని తాజా రిపోర్టుల  ద్వారా తెలుస్తోంది.  రిలయన్స్  42వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సందర్భంగా  అధికారికంగా ఈ సేవలను ప్రారంభించనుందని అంచనా. 

జియో గిగా ఫైబర్‌తో భారత దేశంలోని బ్రాండ్‌బాండ్‌తో పాటు డీటీహెచ్‌ టీవీ రంగంలో(బీటా ట్రయల్స్) ఇప్పటికే జియో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లతో భారతదేశంలో1100 నగరాల్లో జియో గిగా ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను సంస్థ ప్రారంభించినప్పటికీ  కమర్షియల్‌గా ఇంకా లాంచ్‌ కాలేదు.  ప్రధానంగా ఇటీవల డీటీహెచ్‌ బాదుడు షురూ అయిన నేపథ్యంలో జియో గిగా ఫైబర్‌ లాంచింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది తీపి కబురే.

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో భారీ లాభాలను నమోదు చేసింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ జియో గిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. లాంచింగ్‌ వివరాలను స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ, జియోగిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చాలా విజయవంతమయ్యాయి, 50 మిలియన్లకు పైగా వినియోగదారులే లక్ష్యంగా త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామని  ప్రకటించడం గమనార్హం. 

జియో గిగా ఫైబర్ మొదట సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీగా రూ. 4,500గా ఉంది. అనంతరం ఇటీవల తన ఆప్టికల్ నెట్‌వర్క్ టెర్మినల్ (ఒఎన్‌టి) ద్వారా  కేవలం రూ.2500 సెక్యూరిటీ డిపాజిట్‌తో  బ్రాడ్‌బాండ్‌ సేవలు, వాయిస్‌ కాల్స్‌, ఓపీటీవీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం 600 రూపాయల కాంబో ప్లాన్‌తోపాటు, గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, జియో హోమ్ టీవీ, జియోటీవీలను ఒకే నెలవారీ ప్యాకేజీ కిందకి తీసుకువచ్చేలా తన ఉద్యోగులతో ట్రిపుల్ ప్లే ప్లాన్‌ను పరీక్షిస్తోంది. జియో డేటా సేవల మాదిరిగానే ఇది కూడా సునామీ సృష్టించనుందా? ఎలాంటి టారిఫ్‌లను అమలు చేయనుంది, ఎలాంటి ప్లాన్లను తీసుకురానుందని అనేదానిపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ‍ప్రకటన కోసం వేచి  చూడాల్సిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top