భారత్‌లో ఆభరణాల డిమాండ్‌ బాగుంటుంది 

Jewelery demand in India is good - Sakshi

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనాలు  

ముంబై: ప్రస్తుతానికి కొంత మందగమనం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బంగారం ఆభరణాలకు భారత్‌లో డిమాండ్‌ పెరుగుతుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) అంచనావేసింది. దేశంలో ప్రజల అభిరుచులు బంగారానికి డిమాండ్‌ పెంచుతుందని పేర్కొంది. ‘‘బంగారం 2049: వచ్చే 30 సంవత్సరాల్లో పసిడి ధోరణి’’ అన్న అంశంపై డబ్ల్యూజీసీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. చైనాలో కూడా పసిడికి డిమాండ్‌ దీర్ఘకాలంలో బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ నివేదిక వ్యక్తం చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... చైనాలో ఆదాయాలు పెరుగుతున్నాయి. వినియోగ ఆధారిత ఎకానమీగా చైనా రూపుదాల్చుతోంది.

ఇక భారత్‌ విషయంలో పసిడి ప్రజల అభిరుచుల్లో ఒక భాగం. ఆయా అంశాలు ఇక్కడ పసిడికి డిమాండ్‌కు దోహదపడతాయి. భారత్‌లో గ్రామీణ ఆదాయాలు పెరగడానికి ప్రభుత్వ చర్యలు పసిడికి డిమాండ్‌ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.   భారత్‌ విషయంలో 25,000 టన్నుల పసిడి స్టాక్‌ను రీసైక్లింగ్‌ చేసే కార్యకలాపాలు చురుగ్గా సానుతున్నాయి. ఇది పసిడి దిగుమతులు తగ్గడానికి వీలుకల్పిస్తుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top