ట్రైన్‌ టిక్కెట్లపై ఐఆర్‌సీటీసీ డిస్కౌంట్‌ ఆఫర్‌ | IRCTC Offers 10% Discount On Train Tickets | Sakshi
Sakshi News home page

ట్రైన్‌ టిక్కెట్లపై ఐఆర్‌సీటీసీ డిస్కౌంట్‌ ఆఫర్‌

Sep 4 2018 7:27 PM | Updated on Sep 4 2018 7:27 PM

IRCTC Offers 10% Discount On Train Tickets - Sakshi

న్యూఢిల్లీ : ట్రైన్‌ జర్నీ చేయాలని ఏమైనా ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి ఇదే సరియైన సమయమట. తన అధికారిక వెబ్‌సైట్‌ www.irctc.co.in ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికి అమేజింగ్‌ డిస్కౌంట్లను దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం లిమిటెడ్‌ ఆఫర్‌(ఐఆర్‌సీటీసీ) చేస్తుంది. పేటీఎం, మొబిక్విక్‌ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.  చివరి నిమిషంలో టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా.. అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకునేలా డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. మొబిక్విక్‌ ద్వారా రైల్వే టిక్కెట్‌ బుకింగ్‌ పేమెంట్లు జరిపే వారికి 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. తన ప్లాట్‌ఫామ్‌పై టిక్కెట్‌ బుకింగ్స్‌ జరిపే వారికి 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే కూడా 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది. 

డిస్కౌంట్‌ ఆఫర్‌ పొందడమెలా...

  • ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ www.irctc.co.inకు వెళ్లాలి.
  • యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.
  • మీ ప్రయాణ వివరాలు నమోదు చేయాలి.
  • క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి, పేమెంట్‌ ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయాలి.
  • పేమెంట్‌ మోడ్‌లో, ఈ-వాలెట్‌ ఆప్షన్లను ఎంచుకోవాలి.
  • వాలెంట్‌ కేటగిరీలో పేటీఎం, ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌ ఎంచుకోవాలి. వీటికి ఐఆర్‌సీటీసీ ఆఫర్‌ వర్తిస్తుంది.
     

Advertisement
 
Advertisement
Advertisement