Sakshi News home page

వడ్డీరేట్లు తగ్గుతాయి: కేంద్రం

Published Fri, Mar 6 2015 3:43 AM

వడ్డీరేట్లు తగ్గుతాయి: కేంద్రం

న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు బ్యాంకులు వడ్డీ రేటును తప్పనిసరిగా తగ్గిస్తాయని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపోరేటు తగ్గింపు నేపథ్యంలో సిన్హా ఈ ప్రకటన చేశారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని సైతం అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయానికి దోహదపడే పలు చర్యలను కేంద్రం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘బ్యాంకర్ల ప్రకటన మీరు చూసినట్లయితే, వడ్డీరేట్ల తగ్గింపు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తాయి.

అయితే ఇందుకు వాటికి కొంత సమయం కావాలి. ఆర్థిక వ్యవస్థలో రాత్రికిరాత్రి ఏ పరిణామమూ చోటుచేసుకోదు. త్వరలో బ్యాంకుల రేట్ల కోత చోటుచేసుకుంటుంది’ అని జయంత్ అన్నారు. బుధవారంనాడు సిన్హా ఒక ప్రకటన చేస్తూ, ఆర్‌బీఐ రేట్లకోత నిర్ణయాన్ని స్వాగతించారు. ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు గణనీయంగా తగ్గుతాయనీ అన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే నిర్ణయంగా దీనిని పేర్కొన్నారు.

Advertisement
Advertisement