5 నెలల గరిష్టానికి ద్రవ్యోల్పణం, నష్టాల్లో సెన్సెక్స్ | Inflation soars to 5-month high of 6.01 percent in May | Sakshi
Sakshi News home page

5 నెలల గరిష్టానికి ద్రవ్యోల్పణం, నష్టాల్లో సెన్సెక్స్

Jun 16 2014 1:28 PM | Updated on Sep 2 2017 8:54 AM

భారత టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది. గత నెలతో పోల్చుకుంటే మే మాసంలో ద్రవ్యోల్పణం 5.20 శాతం ఎగిసింది.

న్యూఢిల్లీ: భారత టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది. గత నెలతో పోల్చుకుంటే మే మాసంలో ద్రవ్యోల్పణం 5.20 శాతం ఎగిసింది.  
 
ద్రవ్యోల్పణం పెరుగుదలకు కూరగాయలు, చేపలు, పౌల్ట్రీ లాంటి ఆహార పదార్థాలు, కాఫీ, టీ వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్టస్థాయికి చేరుకుంది. 
 
చమురు, విద్యుత్ ద్రవ్యోల్బణం 10.53 శాతం నుంచి 14.21 శాతానికి పెరిగింది. పెట్రోల్ ధరలు 12.28 శాతం పెరిగాయి. ఆలుగడ్డ ధర 31.44 శాతం పెరగడం కారణంగా ఆహార ద్రవ్యోల్పణం 9.50 శాతం ఎగిసింది. గతంలో అందించిన రిపోర్టుల ఆధారంగా మార్చి ద్రవ్యోల్పణం 5.70 శాతం నుంచి 6 శాతానికి సవరించారు. 
 
ద్రవ్యోల్పణం పెరుగుదల కారణంగా భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 25120 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 7508 వద్ద ముగిసాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement