పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగాయ్... | Indirect tax collection soars 37% in April-May | Sakshi
Sakshi News home page

పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగాయ్...

Jun 10 2016 12:47 AM | Updated on Sep 4 2017 2:05 AM

పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగాయ్...

పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగాయ్...

పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 37% పెరిగాయని రెవెన్యూ కార్యదర్శి హశ్‌ముఖ్ అథియా తెలిపారు.

న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 37% పెరిగాయని రెవెన్యూ కార్యదర్శి హశ్‌ముఖ్ అథియా తెలిపారు. పరోక్ష పన్నుల్లో ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్‌లు ఉంటాయి. అయితే ఈ పరోక్ష పన్నులు ఎంత వసూలయ్యాయో వివరాలను ఆయన వెల్లడించలేదు. అడిషనల్ రెవెన్యూ మీజర్స్(ఏఆర్‌ఎం) కాని పరోక్ష పన్ను వసూళ్లు 14%, ఏఆర్‌ఎంతో కూడిన పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం చొప్పున పెరిగాయని వివరించారు.

పారిశ్రామిక తయారీ రంగాలపై విధించే ఎక్సైజ్ పన్ను వసూళ్లను ఏఆర్‌ఎం కాని వసూళ్లు గాను, పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం వసూళ్లను ఏఆర్‌ఎం వసూళ్లుగాను పరిగణిస్తారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7.78 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలు చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యంగా పెట్టుకున్నారు.  గత ఆర్థిక సంవత్సరం వసూళ్లు (రూ.7.09 లక్షల కోట్ల)తో పోల్చితే ఇది 10 శాతం అధికం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement