టాప్-5 మార్కెట్లలో భారత్: ఫిట్ బిట్ | india is no:1 in top 5 markets :fitbit | Sakshi
Sakshi News home page

టాప్-5 మార్కెట్లలో భారత్: ఫిట్ బిట్

May 6 2016 2:30 AM | Updated on Sep 3 2017 11:28 PM

వేరబుల్ ఉపకరణాలను విక్రయిస్తున్న ఫిట్‌బిట్‌కు టాప్-5 మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఇక్కడి ఆఫ్‌లైన్ మార్కెట్లో ఫిట్‌బిట్ వాటా 70 శాతం ఉంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేరబుల్ ఉపకరణాలను విక్రయిస్తున్న ఫిట్‌బిట్‌కు టాప్-5 మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఇక్కడి ఆఫ్‌లైన్ మార్కెట్లో ఫిట్‌బిట్ వాటా 70 శాతం ఉంది. కంపెనీకి భారత్‌లో టాప్-3 సిటీగా హైదరాబాద్ చోటు సంపాదించిందని ఫిట్‌బిట్ ఇండియా జీఎం మనీషా సూద్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 2011 నుంచి 2015 సెప్టెంబరు మధ్య 63 దేశాల్లో కంపెనీ 3 కోట్ల యూనిట్లను విక్రయించింది. వేరబుల్ మార్కెట్ 40-45 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోందని ఆమె చెప్పారు. 2015లో పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 12.6 కోట్ల యూనిట్లు నమోదు చేసిందన్నారు. వేరబుల్ ఉపకరణాలు లైఫ్‌స్టైల్ విభాగంలోకి వచ్చి చేరాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement