స్వర్ణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ: సీఈఏ | India can achieve 8-10% growth in three years: Arvind Subramanian, CEA | Sakshi
Sakshi News home page

స్వర్ణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ: సీఈఏ

Apr 26 2016 12:56 AM | Updated on Sep 3 2017 10:43 PM

స్వర్ణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ: సీఈఏ

స్వర్ణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ: సీఈఏ

ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగంలో పయనిస్తోందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభివర్ణించారు.

చెన్నై: భారత్ ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగంలో పయనిస్తోందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభివర్ణించారు. ప్రతికూల, నిరాశాధోరణి వార్తలకు దూరంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (ఐఎఫ్‌ఎంఆర్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... పలు సవాళ్లతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రానున్న మూడు సంవత్సరాల్లో భారత్ 8 నుంచి 10 శాతం శ్రేణిలో వృద్ధిని సాధించగలదన్నది తమ అభిప్రాయమని తెలిపారు. ఉన్నత లక్ష్యం ఉంటే... దీని సాధనలో ఎదురయ్యే తాత్కాలిక వైఫల్యాలను సులభతరంగా ఎదుర్కొనవచ్చని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement