golden age
-
అమెరికా ఈజ్ బ్యాక్
వాషింగ్టన్: ‘అమెరికా స్వర్ణయుగం’ ఇప్పుడే మొదలైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అని ఉద్ఘాటించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని స్పష్టంచేశారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చబోతున్నామని చెప్పారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం రాత్రి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ మొదటిసారిగా మాట్లాడారు. ఏకంగా ఒక గంట 40 నిమిషాలకుపైగా ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో గానీ, తొలి స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో గానీ అధ్యక్షుడు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పటిదాకా బిల్ క్లింటన్ పేరిట ఉన్న రికార్డును ట్రంప్ తిరగరాశారు. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో ఒక గంట 28 నిమిషాల 49 సెకండ్ల పాటు ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ తన తాజా ప్రసంగంలో పలు కీలక అంశాలపై స్పందించారు. సరిహద్దు భద్రత, టారిఫ్‌లు, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందం, ఇంధన భద్రత, ధరల పెరుగుదల, అక్రమ వలసలు తదితర అంశాలపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. పనామా కాలువను స్వా«దీనం చేసుకుంటామని, గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది ‘‘ఇండియాతోపాటు ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధికంగా సుంకాలు విధిస్తున్నాయి. ఇలా చేయడం ముమ్మాటికీ అన్యాయమే. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా తదితర దేశాల టారిఫ్‌ల గురించి విన్నారా? ఇండియాలో అయితే అటో టారిఫ్‌లు 100 శాతానికి పైగా విధిస్తున్నారు. చాలాదేశాలు దశాబ్దాలుగా మా ఉత్పత్తులపై సుంకాల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు సుంకాల మోత మోగిస్తున్నాయి. ఈ భూగోళంపై ఉన్న దాదాపు ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది. ఇకపై ఈ దోపిడీ సాగడానికి వీల్లేదు. ఇప్పుడు మా వంతు వచి్చంది. మా ఉత్పత్తులపై సుంకాలు విధించే దేశాల ఉత్పత్తులపై మేము కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేస్తాం. వచ్చే నెల 2వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. ఆయా దేశాలు వారి ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయకపోతే టారిఫ్‌లు చెల్లించాల్సిందే. ట్రంప్ పాలనలో కొన్ని సందర్భాల్లో టారిఫ్‌లు చాలాచాలా అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎవరైనా వారి మార్కెట్లలోకి మమ్మల్ని రానివ్వకపోతే మేము కూడా అదే పనిచేస్తాం. మా మార్కెట్లలోకి వారిని అడుగు పెట్టనివ్వం. జెలెన్స్కీ లేఖ ప్రశంసనీయం ఉక్రెయిన్‌తో ఘర్షణకు ముగింపు పలికి, శాంతిని కోరుకుంటున్నట్లు రష్యా నుంచి నాకు బలమైన సంకేతాలు అందాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి నాకు ఈరోజే ఒక ముఖ్యమైన లేఖ అందింది. శాంతి సాధన కోసం సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల కంటే మిన్నగా శాంతిని ఆకాంక్షిస్తున్నవారు ఎవరూ లేరని లేఖలో జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇది నిశ్చయంగా శుభ పరిణామం. శాశ్వత శాంతి కోసం ట్రంప్ నాయకత్వంలో పని చేస్తామని జెలెన్స్కీ, ఆయన బృందం చెప్పారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని వారు తెలిపారు. ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వం, స్వాతంత్య్రాన్ని అమెరికా కాపాడుతుందని వారు ఆశిస్తున్నారు. అదే సమయంలో అరుదైన ఖనిజాల సరఫరాతోపాటు ఉక్రెయిన్ భద్రత విషయంలో ఒప్పందంపై ఏ సమయంలోనైనా సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ నా దృష్టికి తీసుకొచ్చారు. జెలెన్స్కీ రాసిన లేఖ ప్రశంసనీయం. క్రూరమైన యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాలో ఇప్పటికే లక్షలాది మంది అన్యాయంగా బలైపోయారు. చాలామంది క్షతగాత్రులుగా మారారు. ఈ మారణకాండ ఆగిపోవాల్సిందే. మతిలేని యుద్ధాన్ని ఆపేయాల్సిన సమయం ఇదే. ఉక్రెయిన్‌లో ఘర్షణకు తెరదించడానికి నేను ఎంతగానో కష్టపడుతున్నా. రష్యా ప్రతినిధులతో ఇటీవలే చర్చలు జరిపాం. శాంతి కోసం సిద్ధంగా ఉన్నట్లు వారు బలమైన సంకేతాలిచ్చారు. ఇది నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా. కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు పాల్పడి 13 మంది అమెరికా సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది ముహమ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. పాకిస్తాన్ సాయంతో అతడిని బంధించాం. అమెరికాకు తరలిస్తున్నాం. సత్వరమే చట్టప్రకారం విచారణ చేపట్టి, అతడిని శిక్షిస్తాం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో అప్పటి పాలకులు న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని కాశ్ పటేల్ పునరుద్ధరించారు. కాశ్ పటేల్ మున్ముందు గొప్ప పనులు చేయబోతున్నారు. అలాగే లింగ మార్పిడి చర్యలకు మేము వ్యతిరేకమే. లింగ మారి్పడిని శాశ్వతంగా నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణించే బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరుతున్నా. చిన్నారుల్లో క్యాన్సర్, ఆటిజం కేసులను తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మన పర్యావరణం నుంచి విషకారకాలను, ఆహార పదార్థాల అన్ని రకాల విష రసాయనాలను తొలగించి, చిన్నారులను ఆరోగ్యంగా, బలంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. డ్రిల్ బేబీ డ్రిల్ అమెరికాలో ఇప్పుడు ధరల పెరుగుదలతోపాటు అనేక సమస్యలకు గత జో బైడెన్ ప్రభుత్వమే కారణం. బైడెన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణ సమస్య వేధిస్తోంది. ఏ దేశానికీ లేని విధంగా మన కాళ్ల కింద ద్రవరూపంలో బంగారం ఉంది. ముడి చమురు, సహజ వాయువును వెలికితీస్తే ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారమవుతుంది. బైడెన్ పాలనలో వందకుపైగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు మూసివేశారు. వాటిని మళ్లీ తెరవబోతున్నాం. ఇంధన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాం. నేను అధికారంలోకి రాగానే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి విధించా. కాళ్ల కింద ఉన్న బంగారాన్ని తవ్వితీస్తే ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. దాన్ని డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు. అమెరికా పౌరులందరికీ సామాజిక భద్రత కలి్పంచడమే మా ధ్యేయం. 300 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుకొనే విధానం తీసుకొస్తాం. అక్రమ వలసలపై మా వైఖరేమిటో ఇప్పటికే బయటపెట్టాం. అక్రమ వలసదార్లను బయటకు పంపిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్రమ వలసను అరికట్టడానికి సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఆ దేశాలకు రాయితీలు బంద్ ‘‘పొరుగు దేశాల నుంచి ఫెంటానిల్ వంటి ప్రాణాంతక మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమంగా వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ కారణంగా వేలాది మంది అమెరికా పౌరులు అకాల మరణం చెందుతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతుండడం బాధ కలిగిస్తోంది. ఇలాంటి విషాదం ఎప్పుడూ చూడలేదు. అమెరికా నుంచి వందల బిలియన్ డాలర్ల సబ్సిడీలు పొందుతున్న దేశాలు చేస్తున్న నిర్వాకమిది. కెనడా, మెక్సికో దేశాలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నాం. వందల బిలియన్ల డాలర్ల సొమ్ము ఖర్చు చేస్తున్నాం. ఇకపై ఇలాంటి త్యాగాలకు మేము సిద్ధంగా లేము. మాకు నష్టం కలిగిస్తున్న దేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రాయితీలిచ్చే ప్రసక్తే లేదు’’. గ్రీన్లాండ్ అమెరికాలో భాగం కావాల్సిందే ‘‘పనామా కాలువను మా అ«దీనంలోకి తీసుకోవడానికి మావద్ద ప్రణాళికలు ఉన్నాయి. మా జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి పనామా కాలువను నియంత్రణలోకి తెచ్చుకోక తప్పదు. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. జిమ్మీ కార్టర్ ప్రభుత్వం కేవలం ఒక్క డాలర్‌కు పనామా కాలువను ఇతరులకు ఇచ్చేసింది. అప్పట్లో కుదిరిన ఒప్పందాలు పదేపదే ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక మాది మేం తీసుకుంటాం. గ్రీన్లాండ్ సైతం అమెరికాలో భాగం కాక తప్పదు. ఒక మార్గంలో కాకపోతే మరో మార్గంలో గ్రీన్ల్యాడ్ను స్వా«దీనం చేసుకుంటాం. సొంత భవిష్యత్తును నిర్ణయించుకొనే హక్కు గ్రీన్లాండ్ ప్రజలకు ఉంది. అమెరికా పౌరులుగా మారాలనుకుంటే సాదర స్వాగతం పలుకుతాం. గ్రీన్లాండ్ ప్రజలను భద్రంగా చూసుకుంటాం’’. -
ఇక స్వర్ణయుగం.. అన్నింటా ‘అమెరికాయే ఫస్ట్’: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ జె.ట్రంప్ ప్రకటించారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే జాతినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. నాలుగేళ్ల డెమొక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందని ఆక్షేపించారు. దాన్ని సమూలంగా సరిదిద్దేలా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ‘‘అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడింది. స్వర్ణయుగం మొదలైంది. ఈ జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినం. భవిష్యత్తంతా ఇక మనదే. మన దేశం నేటినుంచి అన్నిరంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతటా మన్ననలు పొందుతుంది. ప్రతి దేశమూ అబ్బురపడేలా, అసూయ చెందేలా, అభినందించేలా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’ అన్నదే మన నినాదం. అదే మన మూలమంత్రం’’ అని 78 ఏళ్ల ట్రంప్ ప్రకటించారు. ‘‘మీ నమ్మకాన్ని మీ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను మీకు తిరిగిస్తా’’ అని అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారు. అరగంట పాటు సాగిన తొలి ప్రసంగంలో ట్రంప్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంటలు రేపే నిర్ణయాలు ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘అమెరికాలోకి వలసలపై ఉక్కుపాదం మోపుతాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తున్నాం. పనామా కాల్వను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది’’ అని ప్రకటించారు. పనామా కాల్వపై చైనా పెత్తనం సాగుతోందని, వద్ద అమెరికా నౌకలపై భారీగా సుంకాలు విధిస్తున్నారని ఆక్షేపించారు. ‘‘వరక్త వ్యవస్థను సమూలంగా మారుస్తాం. అమెరికన్లను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా పలు దేశాలపై సుంకాలు, ఇతర టారిఫ్‌లను పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. డ్రగ్ కార్టల్స్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తాం. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తెచ్చి వాటిని అంతం చేస్తాం. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోంది’’ అని ప్రకటించారు. లూథర్‌కింగ్ కలలను నిజం చేస్తా ట్రంప్ తన ప్రసంగంలో బైడెన్ పాలనపై నిప్పులు చిమ్మారు. ‘‘ఆర్థిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ బైడెన్ యంత్రాంగం కుప్పకూల్చింది. లాస్ ఏంజెలెస్ మంటల వంటి మామూలు సమస్యలను కూడా పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు, డ్రగ్స్ బానిసలకు దేశాన్ని స్వర్గధామంగా మార్చింది. న్యాయవ్యవస్థను విషపూరితంగా, హింసాత్మకంగా మార్చి ఆయుధంలా వాడుకుంది’’ అని ఆరోపించారు. ‘‘న్యాయవ్యవస్థకు సంకెళ్ల నుంచి విముక్తి కల్పిస్తా. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలకు, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తా. దేశీయ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతా. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలను ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటూ వచ్చా. బహుశా అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దేందుకే దేవుడు నన్ను హత్యాయత్నం నుంచి కాపాడాడేమో’’ అన్నారు. దాంతో రిపబ్లికన్ నేతలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. బైడెన్, హారిస్ మౌనంగా వీక్షించారు. ‘‘ఈ రోజు హక్కుల ఉద్యమకారుడు మార్టీన్ లూథర్‌కింగ్ జూనియర్ డే. అమెరికా కోసం ఆయన కన్న కలలను సాకారం చేసి చూపిస్తా. మార్టీన్ లూథర్ లక్ష్యాల సాధనకు మనమంతా సమైక్యంగా కృషి చేద్దాం’’ అని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌కు స్వాగతం: బైడెన్ అంతకుముందు సోమవారం ఉదయం బైడెన్ తన వారసుడు ట్రంప్‌ను అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి ఆత్మియంగా ఆహ్వానించారు. ట్రంప్ దంపతులు వాహనం దిగగానే ప్రధాన ద్వారం వద్ద భార్య జిల్‌తో కలిసి స్వాగతించారు. ‘వైట్‌హౌస్‌కు మరోసారి స్వాగతం’ అంటూ అభినందనలు తెలిపారు. అధ్యక్ష సంప్రదాయం ప్రకారం ట్రంప్ కోసం ఓవల్ కార్యాలయంలో లేఖ రాసిపెట్టారా అని మీడియా ప్రశ్నించగా, ‘అది మా ఇద్దరి మధ్య వ్యవహారం’ అంటూ చమత్కరించారు. అనంతరం ట్రంప్ దంపతులను లోనికి తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం వారికి తేనీటి విందు ఇచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు కూడా కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఉష దంపతులకు స్వాగతం పలికారు. వాన్స్‌కు హారిస్ అభినందనలు తెలిపారు. ఫొటోలకు పోజులిచ్చాక వాన్స్ దంపతులను హారిస్ దంపతులు వైట్‌హౌస్ లోనికి తోడ్కొని వెళ్లారు. అంతకుముందు ట్రంప్ తన కుటుంబీకులతో కలిసి వైట్‌హౌస్ సమీపంలోని చారిత్రక సెయింట్ జాన్ ఎపిస్కోపల్ చర్చి వద్ద సంప్రదాయ ప్రార్థనలు జరిపారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ మెయిలీతో పాటు కూడా పారిశ్రామిక దిగ్గజాలంతా వాటిలో పాల్గొనడం విశేషం.ప్రమాణస్వీకారం ఇలా..ట్రంప్ నాలుగేళ్ల విరామం అనంతరం వైట్‌హౌస్‌లో తిరిగి అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం క్యాపిటల్ హిల్ భవనంలోని రొటుండా హాల్లో డెమొక్రాట్ నేత 82 ఏళ్ల జో బైడెన్ నుంచి లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విపరీతమైన చలి నేపథ్యంలో ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లు్య.బుష్, బిల్ క్లింటన్ దంపతులు, బరాక్ ఒబామా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి దేశాధినేతలు రావడం ఇదే తొలిసారి. దిగ్గజ టెక్ కంపెనీల సారథులు, పారిశ్రామికవేత్తలు ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, ముకేశ్ అంబానీ దంపతులు, రూపర్డ్ మర్డోక్ షౌ చూ తదితరులు కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రంప్ దంపతులు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల నుంచి సంప్రదాయ తేనీటి విందు స్వీకరించారు. తర్వాత బైడెన్‌తో కలిసి ట్రంప్ ఒకే కారులో క్యాపిటల్ హిల్‌కు చేరుకున్నారు. ఇద్దరూ కలిసే రొటుండా హాల్లో అడుగుపెట్టారు. వెంటనే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆహూతులంతా ట్రంప్‌కు, ఆయన రన్నింగ్‌మేట్ జె.డి.వాన్స్, ఉష దంపతులకు ఘనస్వాగతం పలికారు. తొలుత వాన్స్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవనా ఉపాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మరో న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా నా బాధ్యతలను విశ్వాసపాత్రునిగా నెరవేరుస్తా. అమెరికాను, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అంటూ తన తల్లి ఇచి్చన వ్యక్తిగత బైబిల్‌తో పాటు లింకన్ బైబిల్‌పై ప్రమాణం చేశారు. అనంతరం భార్య మెలానియా చెంపపై ముద్దాడారు. ఆమె హ్యాట్ అడ్డురావడంతో చిరునవ్వులు చిందించారు. ట్రంప్‌కు ప్రపంచం నలుమూలల నుంచీ అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. ‘నా ప్రియమిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్‌ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు. ట్రంప్ రాకతో వైట్‌హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్‌తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాలకు కూడా కొత్త రూపు వచ్చింది.విక్టరీ ర్యాలీలో ట్రంప్ డ్యాన్స్ ఆశ్చర్యపరిచిన విలేజ్ పీపుల్ ప్రదర్శన వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’విక్టరీ ర్యాలీని తన ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ముగించారు. 1978 నుంచి హిట్ అయిన ‘విలేజ్ పీపుల్’ట్రాక్ మరోసారి మార్మోగింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ విలేజ్ పీపుల్ బ్యాండ్ ఈ పాటను ప్రదర్శించగా వారి వెనుక నిలబడిన ట్రంప్ అప్పుడప్పుడు పాడారు. స్టేజ్ మీద విలేజ్ పీపుల్ ఏడో సభ్యుడిగా చేరి ట్రంప్ డ్యాన్స్ చేశారు. మార్పుకోసం ఎదురుచూస్తున్నా వాషింగ్టన్: ట్రంప్ సారథ్యంలో అమెరికాలో చాలా మార్పులు చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్ర మాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ ఏరీనాలో ఆదివారం రాత్రి జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ విజయోత్సవ ర్యాలీలో మస్క్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మేం చాలా మార్పులు చేయాలని చూస్తున్నాం. శతాబ్దాలపాటు అమెరికా బలీయశక్తి గా కొనసాగేందుకు వీలుగా మార్పులు చేయ డం ముఖ్యం. అమెరికాను మళ్లీ గొప్పగా మా ర్చుదాం’’అని మస్క్ అన్నారు. మస్క్... లిటి ల్ ఎక్స్ అని పిలుచుకునే తన కుమారుడు ఎ క్స్ ఎ–12 ను కూడా వేదికపైకి తీసుకొచ్చారు. -
స్వర్ణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ: సీఈఏ
చెన్నై: భారత్ ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగంలో పయనిస్తోందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభివర్ణించారు. ప్రతికూల, నిరాశాధోరణి వార్తలకు దూరంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (ఐఎఫ్ఎంఆర్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... పలు సవాళ్లతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రానున్న మూడు సంవత్సరాల్లో భారత్ 8 నుంచి 10 శాతం శ్రేణిలో వృద్ధిని సాధించగలదన్నది తమ అభిప్రాయమని తెలిపారు. ఉన్నత లక్ష్యం ఉంటే... దీని సాధనలో ఎదురయ్యే తాత్కాలిక వైఫల్యాలను సులభతరంగా ఎదుర్కొనవచ్చని అన్నారు. -
జగన్ పాలనతో స్వర్ణయుగం
బొబ్బిలి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగం చూస్తారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని ఆరో వార్డు అభ్యర్థి గెంబలి శ్రీనివాసరావుకు మద్దతు గా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటేసి మంచి పాలకవర్గం రావడానికి అవ కాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఓటర్లే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరైన నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయితేనే ప్రజా సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ సజ్జా వెంకటరావు, వైద్యులు జనార్దనరావు, మున్సిపల్ మాజీ వైస్ ైచైర్మన్లు గెంబ లి సత్యనారాయణ, నారాయణస్వామి,పాల్గొన్నారు. -
వస్తోంది స్వర్ణయుగం
ముదుసలి వయసులో నడవలేక.. చూపు సరిగా కానరాక.. కన్నబిడ్డల సహకారం అందక నిట్టూర్పులిడిచే వృద్ధులకు దిక్కెవరు? అందుకే ప్రభుత్వమే వారిని ఆదుకోవాలి. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితి అత్యంత దుర్భరం. వారికి నెలకు కేవలం రూ.70 పింఛన్ లభించేది. అది కూడా అతి తక్కువ మందికి. ఇక నడవలేని వికలాంగులు.. ఇతర వైకల్యంతో బాధపడేవారికి ఏమాత్రం భద్రత ఉండేది కాదు. ఈ పరిస్థితుల్ని వైఎస్ సమూలంగా మార్చారు. వృద్ధులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున ప్రతి నెలా సమర్థవంతంగా అందించారు. ప్రస్తుతం జిల్లాలో 2,84,154 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. 1,60,789 మంది వృద్ధులు.. చేనేతలు 6,636 మంది, వితంతువులు 70,023 మంది, అభయహస్తం కింద 17,659 మంది నెలకు రూ.200 చొప్పున పింఛన్ అందుకుంటున్నారు. వికలాంగులు రూ.500 తీసుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వీరందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని జగన్ హామీ ఇచ్చారు. వారికి ఆయన చేయదలచుకుంది... వికలాంగులకు రూ.1000, ఇతర సామాజిక పింఛనుదారులకు రూ.700 చొప్పున పింఛను మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల వంటివారు ఆయన్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. పడిగాపుల విధానం పోవాలి అందుకే వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అధిక ధర చెల్లించి కొనుక్కున్న విత్తనాలు.. ఆకాశాన్నంటిన ఎరువులు, పురుగుమందులు.. విపరీతంగా పెరిగిన కూలి రేట్లు.. అయినా అన్నదాత అప్పు చేసి మరీ వ్యవసాయానికి సిద్ధమవుతాడు. వరుణ దేవుడు కరుణించకపోయినా.. భూమాత అయినా కాపాడుతుందిలే అనుకొని నాట్లు వేస్తాడు. కానీ ఏం లాభం. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే పొలం దగ్గర కాపలా కాయాలి. వైఎస్ మరణానంతరం రైతులు అనుభవిస్తున్న వ్యధలివి. ప్రస్తుత పాలకులు వైఎస్ హామీని గాలికి వదిలేశారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నా.. కరెంటు తీగలు వేళ్లాడుతున్నా అధికారులు చలించలేదు. ఈ పరిస్థితులు మార్చేందుకు జగన్ నడుం బిగించారు. ప్రస్తుతం జిల్లాలో 115652 మంది రైతులు ఉచిత విద్యత్ లబ్ధిదారులుగా ఉన్నారు. కానీ వీరంతా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన.. ఎటువంటి ఆటంకాలు లేకుండా 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తామని జగన్ వెల్లడించారు. అందుకే తిరిగి రాజన్న రాజ్యం రాకపోదా అన్న ఆశాభావంతో రైతన్నలున్నారు. 108 సేవలు సరిపోతున్నాయా? ఎక్కడైనా ప్రమాదం జరిగితే.. వైఎస్‌కు పూర్వం పరిస్థితులు ఎలా ఉండేవో గుర్తున్నాయా? క్షతగాత్రులు బతికే అవకాశం ఉన్నా.. ప్రైవేటు వాహనాలు సకాలంలో దొరికేవి కాదు.. ఆస్పత్రుల్లో వెంటనే చేర్చుకొనేవారు కాదు.. ఫలితంగా విలుైవె న ప్రాణాలు అన్యాయంగా పోయేవి. ఈ విధానాన్ని మార్చేందుకు దివంగత నేత వైఎస్ 108 ప్రవేశపెట్టారు. దానివల్ల జరిగిన లాభం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అంబులెన్స్ సేవలు మసకబారుతున్నాయి. వాహనంలో వెంటిలీటర్లు లేక చాలా మంది చనిపోతున్నారు. ఈ విధానాన్ని మార్చేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. 108ని పూర్తిగా ఆధునీకరిస్తానన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రోల్‌మోడల్‌లా తీర్చిదిద్దుతామని స్పష్టం చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.