మారుతీ ‘విటారా బ్రెజా’ వచ్చింది... | Image for the news result Maruti Suzuki Vitara Brezza Launched in India; Prices Start at Rs. 6.99 Lakh | Sakshi
Sakshi News home page

మారుతీ ‘విటారా బ్రెజా’ వచ్చింది...

Mar 9 2016 12:27 AM | Updated on Sep 3 2017 7:16 PM

మారుతీ ‘విటారా బ్రెజా’ వచ్చింది...

మారుతీ ‘విటారా బ్రెజా’ వచ్చింది...

దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘విటారా బ్రెజా’ను మంగళవారం మార్కెట్‌లో ఆవిష్కరించింది.

ధర రూ.6.99 లక్షలు-రూ.9.68 లక్షలు
ముంబై: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘విటారా బ్రెజా’ను మంగళవారం మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర శ్రేణి రూ.6.99 లక్షలు-రూ.9.68 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది.కేవలం డీజిల్ ఇంజిన్ (1.3 లీటర్ ఇంజిన్ సామర్థ్యం) ఆప్షన్‌లో మాత్రమే లభ్యంకానున్న బ్రెజా మోడల్‌లో ఎల్‌డీఐ, ఎల్‌డీఐ (ఓ), వీడీఐ, వీడీఐ (ఓ), జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్, జెడ్‌డీఐ ప్లస్ డ్యూయెల్ టన్ అనే వేరియంట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. బ్రెజా మోడల్ లీటరుకు 24.3 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని పేర్కొంది. బ్రెజా బుకింగ్స్ మంగళవారం నుంచి ప్రారంభమైనట్లు తెలిపింది. డెలివరీ ఈ నెల చివరి నుంచి ఉంటుందని పేర్కొంది. కాగా విటారా బ్రెజా మోడల్ అభివృద్ధికి కంపెనీ రూ. 860 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇది ముఖ్యంగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టీయూవీ 300కు పోటీనిస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement
 
Advertisement
Advertisement