జియోకి కౌంటర్‌ : ఐడియా సూపర్‌ ప్లాన్‌

Idea Cellular Silently Launches Rs 227 Prepaid Plan - Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్‌ జియోకి కౌంటర్‌గా ఐడియా సెల్యులార్‌ కొత్త  ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరసమైన ధరల్లో డేటాను అందిస్తున్న టాప్‌ టెలికాం ఆపరేటర్‌ జియోకు పోటీని ఎదుర్కొనేలా ఇతర కంపెనీలు కొత్త టారిఫ్‌లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఐడియా కూడా కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ను అందిస్తోంది. 28రోజుల వాలిడిటీలో ఈ కొత్త  రూ. 227ల ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో  అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలతో పాటు అన్‌లిమిటెడ్‌  ఉచిత డయలర్ టోన్లు అందిస్తుంది. రోజుకు 3జీ/ 2జీ 1.4జీబీ డేటాను అందిస్తుంది. అం‍టే మొత్తంగా 39.4జీబీ డేటాను కస్టమర్లు వాడుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100ఎస్‌ఎంస్‌లు ఉచితం. ముఖ్యంగా అన్‌లిమిటెడ్  డయలర్‌ టోన్‌,  మిస్డ్ కాల్ అలర్ట్‌  ఈ ప్లాన్‌లో ప్రత్యేక  ఆకర్షణ.

దీంతోపాటు  ఐడియా అన్‌లిమిటెడ్‌  ధమాకా ఆఫర్‌ను కూడా ప్రకటించింది. 199  రూపాయల రీచార్జ్‌ ప్లాన్లతో కలిపి కొన్ని ఎంపిక చేసిన రీచార్జ్‌లపై ప్రిపెయిడ్‌ కస్టమర్లకు  క్యాష్‌బ్యాక్‌,  ఇతర బహుమతులను ఆఫర్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top