ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఢమాల్‌ | ICICI Bank Q4 Net Profit Slides 50percent | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఢమాల్‌

May 7 2018 7:17 PM | Updated on May 7 2018 7:28 PM

ICICI Bank Q4 Net Profit Slides 50percent   - Sakshi

సాక్షి, ముంబై: వీడియోకాన్‌ రుణవివాదంలో ఇరుక్కున్న ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు క్యూ 4 ఫలితాల్లో ఢమాల్‌ అంది.   బ్యాడ్‌ లోన్ల బెడదతో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు నాలుగో త్రైమాసికంలో నికర లాభాలు సగానికి పడిపోయాయి.   విశ్లేషకులు అంచనాలను అందుకోలేని బ్యాంకు క్యూ 4 నికర లాభం రూ. 1,020 కోట్లుగా నమోదైంది.  గత ఏడాది ఇదే త్రైమాసికంలో  ఆర్జించిన నికర లాభం రూ.2,025 కోట్లు.  నెట్ వడ్డీ ఆదాయం సంవత్సరానికి 1 శాతం పెరిగి 6,022 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.24 శాతం పెరిగింది. గత త్రైమాసికంలోని 7.82 శాతంతో పోలీస్తే  ఈక్వార్టర్‌లో  మొత్తం రుణాలు 8.84శాతంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇది 7.89 శాతంగా నమోదైంది. సోమవారం మార్కెట్‌ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో బ్యాంకు వాటాదారులకు  2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు 1.50రూపాయలుచొప్పున  డివిడెండ్‌చెల్లించేందకు ప్రతిపాదించినట్టు వెల్లడించింది.  ఆగస్టు 10న తుది నిర్ణయం ఉంటుందని తెలిపింది.

ఇది ఇలా ఉంటే వీడియోకాన్‌ వివాదం తరువాత మొదటిసారి ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్‌  ఫలితాల సందర్భంగా తొలిసారి మీడియాముందుకు వచ్చారు. ఈ వివాదంలో  బోర్డు తనవైఖరిని వెల్లడించిందని,దర్యాప్తులో విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్టు  ఆమె వెల్లడించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement