ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఛార్జీలు పెంపు | ICICI Bank New Rules: Savings Account Holders Need To Pay Transaction Charges? | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఛార్జీలు పెంపు

Oct 22 2026 2:22 PM | Updated on Oct 22 2026 2:25 PM

ICICI Bank New Rules: Savings Account Holders Need To Pay Transaction Charges?

ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ వినియోగదారులపై ఛార్జీల భారం మోపింది. బ్యాంకింగ్ సేవల రుసుములను సవవరిస్తూ నిర్ణయం తీసుకున్న ఆ బ్యాంక్.. ఎంపిక చేసిన నగదు లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం, సేవింగ్స్ ఖాతాదారులకు ప్రస్తుతం వర్తిస్తున్న ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. ఖాతాదారులు యథావిధిగా నెలవారీ ప్రాతిపదికన మూడు ఉచిత నగదు డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ పొందే సౌలభ్యం కొనసాగుతుంది. అయితే, ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాత లేదా నెలవారీ ఉచిత క్యాష్ లిమిట్ విలువను మించితే మాత్రం వినియోగదారులు జేబు నుంచి మరింత మొత్తం చెల్లించక తప్పదు.

పెరిగిన ఛార్జీలు ఇలా..

బ్యాంక్ బ్రాంచ్‌లు అలాగే క్యాష్ రీసైక్లర్ మెషిన్ల ద్వారా జరిగే నగదు లావాదేవీలపై ఈ పెంపు వర్తిస్తుంది. ఉచిత పరిమితి ముగిసిన తర్వాత ప్రతి రూ.1,000 లావాదేవీపై ఇంతవరకు ఉన్న రూ.3.50 ఛార్జీని రూ.4కు పెంచింది. అలాగే నెలవారీ ఉచిత నగదు పరిమితి రూ.1 లక్ష దాటిన తదుపరి లావాదేవీలకు ఈ పెంపు వర్తిస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది.

ఎవరిపై భారం పడుతుంది?

నెలవారీ పరిమితికి లోబడి సాధారణ లావాదేవీలు నిర్వహించే చిన్న మదుపర్లు, ఖాతాదారులపై ఈ నిర్ణయ ప్రభావం ఉండదు. కేవలం బ్యాంక్ శాఖల ద్వారా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసే హై-వాల్యూ కస్టమర్లు డిసెంబర్ 1 నుంచి ఎక్కువ ఛార్జీ భరించాల్సి ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా బ్యాంకులు కఠిన నిబంధనలు తెస్తున్న నేపథ్యంలో ఐసీఐసీఐ నిర్ణయం సాధారణ ఖాతాదారులపై ఆర్థిక భారాన్ని మోపనుంది.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement