నిరుద్యోగులకు ఐబీఎమ్‌ గుడ్‌న్యూస్‌ | IBM Announced Job Openings In India | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఐబీఎమ్‌ గుడ్‌న్యూస్‌

Jun 19 2020 4:12 PM | Updated on Jun 19 2020 6:03 PM

IBM Announced Job Openings In India - Sakshi

బెంగుళూరు:  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐబీఎమ్‌ వెబ్‌సైట్‌ లింకిడ్‌ ఇన్‌ పేజీలో 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎమ్‌లో 3,50,00మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో మూడో వంతు భారత్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐబీఎమ్‌ తన మాతృదేశమైన (అమెరికా)లో 400 ఉద్యోగులను నియమించునున్నట్లు తెలిపింది. ఐబీఎమ్‌ కంపెనీ ఇండియాలో కంటే తక్కువ నియామకాలు  చేపట్టడం పట్ల అమెరికాకు చెందిన నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఐబీఎమ్‌లో మేనేజర్లు, మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం), డేటా సైంటిస్ట్‌లు, నెట్‌వర్క్‌ , క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌లు తదితర కేటగిరీలలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఐబీఎమ్‌ ప్రకటించింది. ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి బోర్‌గియస్‌ స్పందిస్తూ.. ఐబీఎమ్‌ లాంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లోని ఐటీ నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, యూఎస్‌, యూరప్‌లో వారికి ఐటీ నిపుణుల కొరత వేదిస్తుందని తెలిపారు. మరోవైపు కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి దేశీయ ఐటీ నిపుణులు వైపు ఆలోచిస్తున్నట్లు బోర్‌గియస్ పేర్కొన్నారు.    (చదవండి: ఐబీఎం పోటీలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల సత్తా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement