హెచ్‌యూఎల్‌ చేతికి ‘ఆదిత్య మిల్క్‌’

HUL to acquire Karnataka based ice-cream brand Adityaa - Sakshi

న్యూఢిల్లీ: ‘ఆదిత్య మిల్క్‌’ బ్రాండ్‌ను ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఆదిత్య మిల్క్‌ బ్రాండ్‌ ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్‌ డిజర్ట్‌లను తయారు చేసే ఈ బ్రాండ్‌ యాజమాన్య సంస్థ, విజయకాంత్‌ డైరీ అండ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హెచ్‌యూఎల్‌ తెలిపింది.

భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్‌ డిస్సర్ట్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయనున్నామని హెచ్‌యూఎల్‌ సీఎమ్‌డీ, సంజీవ్‌ మెహతా తెలిపారు.   

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top