షేర్లకు ఎంత కేటాయించాలి..? | How to share Allocate ..? | Sakshi
Sakshi News home page

షేర్లకు ఎంత కేటాయించాలి..?

Jul 6 2014 12:49 AM | Updated on Sep 2 2017 9:51 AM

ఏయే రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత తలెత్తే మరో ముఖ్యమైన ప్రశ్న ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్నది.

ఏయే రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత తలెత్తే మరో ముఖ్యమైన ప్రశ్న ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్నది. 2007లో మార్కెట్ గరిష్ట స్థాయిలో ఇన్వెస్ట్ చేసినవాళ్లలో చాలామంది ఇప్పుడు ఈక్విటీల్లో చాలా కొద్ది మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పడు గమనించాల్సిన వాటిల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
 
దీర్ఘకాలానికే: దీర్ఘకాలంలో సంపదను వృద్ధి చేసుకునే విధంగా షేర్లలో పెట్టుబడి పెట్టాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండే ఇన్వెస్టర్లు ఈక్విటీలకు కనీసం 45 నుంచి 55 శాతం కేటాయించే విధంగా చూసుకోండి. ప్రస్తుతం చాలామంది పోర్ట్‌ఫోలియోలను పరిశీలిస్తే ఈక్విటీ వాటా 10 నుంచి 20 శాతంగా ఉంది. దీర్ఘకాలిక దృష్టితో ఈక్విటీల్లో పెట్టుబడులను క్రమేపీ పెంచుకోండి.
 
రిస్క్-రివార్డ్ ప్రీమియం: ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్-రివార్డ్ ప్రీమియం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఆర్థిక వృద్ధిరేటు తిరిగి గాడిలో పడుతున్నప్పుడు, బుల్ ర్యాలీ ప్రారంభంలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే వారికి రిస్క్ తక్కువగా ఉండి, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఇన్వెస్టర్లు పెట్టుబడులు ప్రారంభించినట్లు గత 2 నెలల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెరుగుతున్న పెట్టుబడులే చూపుతున్నాయి. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement