నిరాశపర్చిన ఐసీఐసీఐ ఫలితాలు

Higher expenses drag down ICICI Bank Q4 net to Rs 969 crore - Sakshi

లాభం 5 శాతం తగ్గి రూ. 969 కోట్ల నికరనష్టం

మొత్తం ఖర్చులు 18.1 పెరిగి 14,680 కోట్లకు 

సాక్షి: ముంబై:  ప్రయివేటు బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు  2019 మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నష్టాల షాక్‌  తగిలింది.  విశ్లేషకుల  అంచనాలను అందుకోలేని  బ్యాంకు  ఆర్థిక ఫలితాలు నిరాశపర్చాయి.  బ్యాంకులాభం 5 శాతం తగ్గి 969 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం  రూ. 1,020 కోట్లగా ఉంది. ఈ క్వార్టర్లో  2,129 కోట్ల లాభం ఉండొచ్చని విశ్లేషకుల అంచనా వేశారు.

మొత్తం ఖర్చులు 18.1 పెరిగి 14,680 కోట్లకు చేరుకున్నాయి. నాల్గవ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 27శాతం పెరిగిం రూ.7620 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ.3261 కోట్లుగా నమోదు.  అలాగే గత త్రైమాసికంతో పోలిస్తే  మార్జిన్లు 3.40 శాతం నుంచి 3.72 శాతాని చేరాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top