హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభం రూ.364 కోట్లు 

HDFC Life net inches up 5% to Rs 364 cr - Sakshi

 5 శాతం వృద్ధి

ముంబై: ప్రైవేట్‌ రంగ బీమా కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 5 శాతం పెరిగింది. గత క్యూ4లో రూ.364 కోట్ల నికర లాభం సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ తెలిపింది. పరిశ్రమని మించిన వృద్ధిని సాధిస్తున్నామని, లాభదాయకతలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ విభా పడాల్కర్‌ తెలిపారు.  

పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,109 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.1,277 కోట్లకు పెరిగిందని  విభా పేర్కొన్నారు. మార్కెట్‌ వాటా పరంగా కొత్త వ్యాపార ప్రీమియమ్‌ 19.1 శాతం నుంచి 20.7 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్‌ స్వల్పంగా నష్టపోయి రూ. 399.35 వద్ద ముగిసింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top