ఆ రికార్డు సాధించిన తొలి బ్యాంకు ఇదే!

HDFC Bank becomes first Indian bank to cross Rs5 trillion - Sakshi

సాక్షి, ముంబై:  ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సరికొత్త రికార్డ్‌ సాధించింది. ఈ బ్యాంకు షేరు గురువారం నాటి ట్రేడింగ్‌లో 2.5 శాతం ఎగిసి రూ.1,938 వద్ద సరికొత్త  గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్‌ పరంగా హెచ్‌డీఎఫ్‌సీ రూ.5 లక్షల కోట్ల మైలురాయిని  అధిగమించింది. అంతేకాదు ఈ ఘనతను సాధించిన తొలి బ్యాంకుగా రికార్డ్‌ నెలకొల్పింది. అలాగే  టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనంతరం ఈ రికార్డ్‌ సాధించిన  మూడవ  కంపెనీగా నిలిచింది.  

మార్కెట్‌ విలువ రీత్యా రూ. 5 లక్షల కోట్ల క్లబ్‌లో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్) తొలిసారి స్థానాన్ని పొందింది. ఆ తరువాత ఈ కోవలోకి  ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఈ క్లబ్‌లో చేరిన రెండో సంస్థగా నిలిచింది.  అనంతరం  భారీగా పుంజుకున్న ఆర్‌ఐఎల్‌ మార్కెట్ విలువ రీత్యా  రూ. 5.86 లక్షల కోట్లకు ఎగబాకి అగ్రస్థానంలో నిలవగా, రూ. 5.46 లక్షల కోట్ల కేపిటలైజేషన్‌తో టీసీఎస్‌ రెండో స్థానంలోఉంది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్‌ విలువలో ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా చేరింది.  తాజాగా  రూ. 5.04 లక్షల కోట్లతో మూడో ర్యాంకు కొట్టేసింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top