నవంబర్‌లో  తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు | GST was reduced in November | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో  తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు

Dec 27 2017 12:34 AM | Updated on Dec 27 2017 12:34 AM

GST was reduced in November - Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా రెండ వ నెల నవంబర్‌లోనూ తగ్గాయి. రూ.80,808 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో నూతన పన్ను వ్యవస్థ ప్రారంభమైన తర్వాత  వసూళ్లలో ఇది కనిష్టస్థాయి. కొత్త జాతీయ అమ్మకపు పన్ను విధానాన్ని మరింత ఆమోదనీయంగా మలచడంలో భాగంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణం.  తాజా వసూళ్లపై ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగా చూస్తే...

అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.83,000 కోట్లు , నవంబర్‌లో ఇవి  రూ. 80,808 కోట్లకు చేరాయి. 
జూలైలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 95,000 కోట్లు. ఆగస్టులో రూ.91,000 కోట్లు. సెప్టెంబర్‌లో రూ.92,150 కోట్లు.
నవంబర్‌ వసూళ్లు రూ.80,808 కోట్లలో రూ. 7,798 కోట్లు కాంపెన్సేగా సెస్‌గా వసూలయ్యాయి. రూ.13,089 కోట్లు సెంట్రల్‌ జీఎస్‌టీకాగా రూ.18,650 కోట్లు రాష్ట్ర జీఎస్‌టీ. రూ.41,270 కోట్లు ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ జీఎస్‌టీ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement