నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 7.4 శాతం: ఇక్రా | Growth in the fourth quarter was 7.4 per cent | Sakshi
Sakshi News home page

నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 7.4 శాతం: ఇక్రా

May 22 2018 1:05 AM | Updated on May 22 2018 1:05 AM

Growth in the fourth quarter was 7.4 per cent - Sakshi

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2017–18 నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 7.4 శాతంగా ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. మూడవ త్రైమాసికంలో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యింది. రబీ పంట దిగుబడులు, కార్పొరేట్‌ ఆదాయాలు పెరిగే అవకాశాలు క్యూ4 ఫలితం మెరుగుదలకు కారణంగా పేర్కొంది.

మే 31వ తేదీన నాల్గవ త్రైమాసికం జీడీపీ గణాంకాలతో  పాటు 2017–18 ఆర్థిక సంవత్సరం జీడీపీ తొలి అంచనాలను అధికారికంగా కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement