
పిల్లల కోసం ప్రత్యేక లోకం
ఇంటి ఎంపికలో పిల్లలు కీలకంగా వూరారు. వారి ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఇల్లు ఉంటేనే కొనేందుకు తల్లిదండ్రులు వుుందుకొస్తున్నారు.
చిన్నారుల గది డిజైనింగ్‌లో తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: ఇంటి ఎంపికలో పిల్లలు కీలకంగా వూరారు. వారి ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఇల్లు ఉంటేనే కొనేందుకు తల్లిదండ్రులు వుుందుకొస్తున్నారు. పిల్లల ఆలోచనలు, ఆసక్తిలను గమనించి వారి కోసం ప్రత్యేకమైన గదిని కేటాయిస్తున్నారు. అంతేకాదు ఆ గదిని చిన్నారుల్లో సృజనాత్మక శక్తిని మేల్కొలిపేలా, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారుల గది డిజైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
* చిన్నారులు గదిలో ఆడడం, చదవడం, నిద్రపోవడం లాంటివి చేస్తారు. అదే వాళ్ల ప్రపంచం. వారిని ఆకట్టుకునేలా ముదురు రంగులు వాడటమే కాకుండా గోడల మీద రకరకాల డిజైన్లు వేయడం, ఒకే గోడ మీద రెండు రంగులు వేయడం చేయవచ్చు. పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒకే గోడను మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది.
* చిన్నారుల కోసం ఫర్నీచర్, మంచం లాంటివి కొనేప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి. పిల్లల పుస్తకాలు కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి, చక్కటి అల్మరాను పెట్టించడం మంచిది.
* మంచంపై పరుపు మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉంటే పిల్లలు ఇష్టంగా ఎక్కువసేపు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.
* మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు.
* పిల్లలకు ఇష్టమైన కార్టూన్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తలో భయపడే అవకాశం ఉంది. చీకట్లో కూడా మెరిసేలా సీలింగ్‌కు మెటాలిక్ రంగులు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు.
* పిల్లల గదిలో కంటికి శ్రమ కలిగించని ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. లైటింగ్ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా
చూసుకోవాలి.