త్వరలోనే చౌకగా పెట్రోల్‌

Govt announces Methanol Policy for 15% blending of methanol in petrol - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్వరలోనే పెట్రోల్‌ చౌకగా లభ్యం కానుంది. కేంద్ర ప్రభుత్వం నేడు మిథనాల్‌ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీతో పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ మిశ్రమాన్ని కలుపనున్నారు. దీంతో పెట్రోల్‌ ధరలు  దిగి వస్తాయని,  కాలుష్యాన్ని కూడా అరికట్ట వచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్ల శాఖమంత్రి నితిన్‌ గడ్కారీ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80తో పోలిస్తే, బొగ్గు నుంచి ఉత్పత్తికి అయ్యే మిథనాల్‌ ఖర్చు లీటరుకు కేవలం రూ.22లు మాత్రమేనని చెప్పారు. చైనా అయితే ఏకంగా దీన్ని రూ.17కే ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.

దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్‌సీఎఫ్) సహా ముంబై చుట్టుపక్కల చాలా కర్మాగారాలు మిథనాల్‌ను ఉత్పత్తి చేయగలవని కేంద్ర మంత్రి అన్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఖర్చులూ తగ్గుతాయని, కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. స్వీడన్‌ ఆటో మేజర్‌ వోల్వో మిథనాల్‌తో నడిచే స్పెషల్‌ ఇంజీన్‌ను రూపొందించిందనీ, స్థానికంగా తయారైన ఇంధనంతో 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కారీ తెలిపారు. అలాగే ఇథనాల్‌ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top