గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌పై భారీ డిస్కౌంట్‌ | Google Pixel XL gets 45 per cent discount on Amazon | Sakshi
Sakshi News home page

గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌పై భారీ డిస్కౌంట్‌

Jan 2 2018 11:47 AM | Updated on Aug 1 2018 3:40 PM

Google Pixel XL gets 45 per cent discount on Amazon - Sakshi

గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ఇండియా భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అమెజాన్‌ ఇండియా ప్రస్తుతం రూ.39,990కు తగ్గించింది. అసలు ఈ ఫోన్‌ ధర రూ.76వేలు. అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌ ప్రకారం గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌పై రూ.36,010 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిసింది. అంటే దాదాపు 47 శాతం డిస్కౌంట్ అన్నమాట‌. ఒక్క పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌పైనే మాత్రమే కాక, కొత్త గూగుల్‌ ఫోన్‌ పిక్సెల్‌ 2పై కూడా అమెజాన్‌ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ భారీ మొత్తంలో డిస్కౌంట్‌ అందిస్తుంది.

 64జీబీ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.61వేల నుంచి రూ,49,999కు ప్లిప్‌కార్ట్‌ తగ్గించింది. అంతేకాక అదనంగా ఎక్స్చేంజ్‌పై రూ.18వేల తగ్గింపును అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్‌ కలిగిన పిక్సెల్‌ 2 ధరను రూ.70వేల నుంచి రూ.58,999 తగ్గించినట్టు కూడా ఫ్లిప్‌ కార్ట్‌ తెలిపింది. తన 2018 మొబైల్‌ బొనాంజ సేల్‌లో వీటిపై డిస్కౌంట్లను ఆఫర్‌చేస్తుంది. రేపటి నుంచి ఈ సేల్‌ ప్రారంభం కాబోతుంది. ఫ్లిప్‌కార్ట్‌ అప్‌కమింగ్‌ ఆఫర్లలో గూగుల్‌ పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లు 13,001 రూపాయలు, 8,001 రూపాయలు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడి కొనుగోలు చేసే వారికి పిక్సెల్‌ 2పై రూ.8000 తగ్గింపు ఉంది. 64జీబీ స్టోరేజ్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ రూ.39,999కు అందుబాటులో ఉంటుండగా.. అతిపెద్ద పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ రూ.52,999కు లభ్యమవుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement