గూగుల్‌ చేతికి హెచ్‌టీసీ?

గూగుల్‌ చేతికి హెచ్‌టీసీ?

శాన్‌ఫ్రాన్సిస్కో : సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌, నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీని తన సొంతం చేసుకోబోతుంది. తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి హెచ్‌టీసీ ఫోన్‌ వ్యాపారాలను గూగుల్‌ కొనుగోలు చేయబోతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. చైనీస్‌ పబ్లికేషన్‌ కమర్షియల్‌ టైమ్స్‌ రిపోర్టు ప్రకారం, హెచ్‌టీసీతో డీల్‌ కుదుర్చుకోవడానికి గూగుల్‌ రెండు ఆప్షన్లను రూపొందించిందని తెలిసింది. వ్యూహాత్మక భాగస్వామిగా లేదా పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌ యూనిట్‌ను కొనుగోలు రూపంలో హెచ్‌టీసీని సొంతం చేసుకోవాలని గూగుల్‌ ప్లాన్‌ చేస్తుందని తెలుస్తోంది. ఈ డీల్‌లో హెచ్‌టీసీకి చెందిన వర్చ్యువల్‌ రియాల్టీ బిజినెస్‌(హెచ్‌టీసీ వైవ్‌)లు భాగం కావని రిపోర్టు పేర్కొంది. 

 

అమెరికాలో ఒకానొక సమయంలో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న హెచ్‌టీసీ, ఇటీవల నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పడికిప్పుడు కొత్త ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌లను తీసుకొచ్చినప్పటికీ హెచ్‌టీసీ కోలుకునేలా కనిపించడం లేదు. కాగ, గూగుల్‌ తన సొంత బ్రాండులో విడుదల చేసిన పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ డివైజ్‌లను హెచ్‌టీసీనే రూపొందించింది. ప్రస్తుతం విడుదల చేయబోయే డివైజ్‌లలో కూడా ఒకదాన్ని హెచ్‌టీసీనే రూపొందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ రిపోర్టుపై స్పందించడానికి ఇరు కంపెనీ తిరస్కరించాయి. ప్రపంచంలో అత్యధిక రేటింగ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో హెచ్‌టీసీ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ హెచ్‌టీసీ యూ11ను జూలైలో విడుదల చేసింది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top