పసిడి ధరలు పైపైకి

 Gold prices rise on soft US data and trade concerns - Sakshi

అంతర్జాతీయంగా 7 వారాల గరిష్టం

దేశీయంగా 10 గ్రా. పసిడి రూ.39వేల పైకి

సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో కాస్త నెమ్మదించిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బులియన్‌ మార్కెట్లో పసిడి ధర మళ్లీ  39 వేల  రూపాయల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్‌ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి.  ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు మంగళవారం 7వారాల గరిష్టాన్ని నమోదు చేసాయి. 

దేశీయంగానే  ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం రూ. 191 పెరిగి 10 గ్రాముల ధర రూ. 39,239 పలికింది. అటు వెండి ధర ఇదే బాటలో పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 943 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,146కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6డాలర్ల పెరిగి 1,495 స్థాయికి చేరింది.  నవంబర్‌ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి విశేషం. ఈ నవంబర్‌లో అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు రెకెత్తాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.101లు పెరిగి రూ.38358.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి అమెరికాలో పసిడి ర్యాలీ కారణంగా నిన్న మార్కెట్‌ ముగిసే సరికి రూ.266  లాభంతో రూ.38,257ల వద్ద స్థిరపడింది. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం తదితర పండుగల నేపథ్యంలో డిమాండ్‌ స్వల్పంగా పుంజుకునే అవకాశం ఉందని బులియన్‌ వర్తకులు భావిస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top