పెరగనున్న ఫ్రిజ్‌లు, ఏసీ ధరలు 

Godrej Appliances to hike prices of fridge, AC by 3-6% - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగానే జీఎస్‌టీ కౌన్సిల్‌ తాజా నిర్ణయంతో రిఫ్రిజిరేటర్లు, ఏసీ రేట్లు మోత మోగనున్నాయి. గోద్రేజ్ గ్రూప్ నకు కన్జ్యూరబు్‌ డ్యూరబుల్స్ సంస్థ  వీటి ధరలను  త్వరలోనే పెంచనున్నట్టు  ప్రకటించింది. ముడిసరుకు, తయారీ ఖర్చు పెరగడంతో ఈ ధరలను కూడా 3 నుంచి 6శాతం పెంచే యోచనలో  ఉన్నట్టు సోమవారం  గోద్రెజ్‌ వెల్లడించింది. అలాగే పెరుగుతున్న గిరాకీ  నేపథ్యంలో  పోర్ట్‌పోలియో విస్తరణ, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూ. 200 కోట్లు పెట్టుబడితో షిర్వాల్‌లో కొత్త ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో దీని నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నామన్నారు.

 ‘తయారీ వస్తువులు  ఉక్కు ధరలు 10-15 శాతం, ప్లాస్టిక్స్ 6-7 శాతం, రాగి 40-50 శాతం పెరిగాయని, దీంతో  తమ ఉత్పత్తుల  ధరలను పెంచాల్సిన అవసరం వచ్చిందని తెలిపింది. అంతేకాదు నవంబర్‌, డిసెంబర్‌లలో ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు 3 నుంచి 6శాతం పెరుగుతాదని గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది  చెప్పారు.  రా మెటీరియల్‌ ధరలను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందన్నారు. మరోవైపు  పండగ సీజన్‌ రావడంతో జులై నుంచి ధరలు పెంచలేదని గోద్రేజ్‌ పేర్కొంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరల పెంపు గురించి యోచిస్తున్నామని  ప్రకటించడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 20 శాతానికిపైగా వృద్ధిని అంచనా  వేస్తున్నట్టు చెప్పారు. 

కాగా  ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లు, ఎసీల  విభాగం  ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయంలో 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జీఎస్‌టీ తర్వాత ఏసీ, ఫ్రిజ్‌లపై పన్నులు కూడా పెరిగాయి. ముఖ్యంగా అంతకు ముందు ఏసీలు, ఫ్రిజ్‌లపై  23-25శాతం జీఎస్‌టీ పన్ను ఉండగా.. ప్రస్తుతం ఇవి 28శాతం జీఎస్‌టీ శ్లాబులోకి చేర్చిన సంగతి  తెలిసిందే. 

Back to Top