జీఎంఆర్‌ చేతికి నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌!

GMR Infra emerges as H1 bidder for Nagpur airport project - Sakshi

హైయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు అత్యధిక మొత్తాన్ని కోట్‌ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాగ్‌పూర్‌లోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధి, కార్యకలాపాలు, నిర్వహణను అత్యధిక మొత్తం కోట్‌ చేసిన కంపెనీ చేపడుతుంది. 30 ఏళ్ల నిర్వహణతో పాటు ప్రాజెక్టులో భాగంగా కొత్తగా టెర్మినల్‌ను నిర్మించాల్సి ఉంటుంది.

జీవీకే సైతం నాగ్‌పూర్‌ ప్రాజెక్టును దక్కించుకోవడానికి పోటీ పడింది. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరించేందుకు మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాల సంయుక్త భాగస్వామ్య కంపెనీ మల్టీ మోడల్‌ ఇంటర్నేషనల్‌ హబ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎట్‌ నాగ్‌పూర్‌ (మిహాన్‌ ఇండియా) ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియను 2018 మార్చిలో ప్రారంభించింది. నాగ్‌పూర్‌ విమానాశ్రయం నుంచి 2017–18లో 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 7,800 టన్నుల కార్గో రవాణా జరిగింది. ఇక్కడి ఎయిర్‌పోర్టులో అయిదేళ్లుగా ప్రయాణికుల సంఖ్య ఏటా 11% పెరుగుతూ వస్తోంది. కార్గో రవాణా పరంగా దేశంలో 17వ స్థానంలో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top