జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా

GDP Expected To Grow At 7.2 Percent In 2018-19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) అంచనా వేసింది. అంతకుముందు ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. వ్యవసాయం, ఉత్పాదక రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచడంతో వృద్ధి రేటు మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరానికి తొలి ముందస్తు అంచనాలు వెల్లడిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్టు సీఎస్‌ఓ వెల్లడించింది. వ్యవసాయం, అటవీ సంబంధిత, మత్స్య కార్యకలాపాలు గత ఏడాది 3.4 శాతం ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి పెరగనున్నాయని పేర్కొంది. ఇక 2017-18లో 5.7 శాతంగా నమోదైన తయారీ రంగం 8.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కాగా 2015-16లో దేశ జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధిస్తే,2016-17లో 7.1 శాతం వృద్ధి సాధించింది. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంతో 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతానికి తగ్గింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top