వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌ వెతుకులాట | Sakshi
Sakshi News home page

వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌ వెతుకులాట

Published Tue, May 29 2018 11:21 AM

Flipkart Looking For Senior Executives To Take On Competition - Sakshi

న్యూఢిల్లీ : అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అనంతరం ఈ-రిటైల్‌ స్పేస్‌లో మరింత పోటీ పెరిగింది. ఈ పోటీ నేపథ్యంలో అమెజాన్‌కు చెక్‌ పెట్టేందుకు ఫ్లిప్‌కార్ట్‌ తన లీడర్‌షిప్‌ టీమ్‌ను బలోపేతం చేసుకుంటోంది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను వెతుకుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నాలుగు పోస్టులకు కంపెనీ వెతుకులాట చేపట్టిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. వాటిలో ఒకటి హెడ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, రెండు చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌, మూడు చీఫ్‌ హెచ్‌ఆర్‌, నాలుగు సప్లై చైన్‌, మార్కెటింగ్‌ సీనియర్‌ అని పేర్కొన్నాయి. వాల్‌మార్ట్‌ డీల్‌ అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ఈ నియమకాలు చేపడుతోంది. ఈ సెర్చింగ్‌లతో అమెజాన్‌కు గట్టి పోటీ ఇస్తూ.. మరింత ముందుకు దూసుకెళ్తూ.. పెద్ద మొత్తంలో మార్కెట్‌ను తన సొంతం చేసుకోవాలని ఫ్లిప్‌కార్ట్‌ చూస్తున్నట్టు ఓ దిగ్గజ సెర్చ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. 

15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ అనుభవమున్న వారిని ప్రొడక్ట్‌ కేటగిరీలు, మిషన్‌ టెర్నింగ్‌ వంటి హైఎండ్‌ టెక్నాలజీల కోసం నియమించుకుని, ఫ్లిప్‌కార్ట్‌ విస్తరణ చేపడుతుందని ఈ-కామర్స్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ మెగా డీల్‌తో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ సపోర్టుతో అమెజాన్‌పై పోటీకి దిగనుంది. దీని కోసం కూడా ఫ్లిప్‌కార్ట్‌కు బలమైన, అతిపెద్ద టీమ్‌ అవసరమని ఈఎంఏ పార్టనర్స్‌ ఇంటర్నేషనల్‌ సీనియర్‌ పార్టనర్‌ ఎం రామచంద్రన్‌ అన్నారు. అయితే ఈ విషయంపై స్పందించానికి ఫ్లిప్‌కార్ట్‌ నిరాకరించింది. అమెజాన్‌కు వ్యతిరేకంగా తన కంపెనీని మరింత విస్తరించేందుకు ఈ లీడర్‌షిప్‌ టీమ్‌ ఎంతో అవసరమని మార్కెట్‌ నిపుణులు కూడా పేర్కొన్నారు. వాల్‌మార్ట్‌ కొనుగోలుతో ఫ్లిప్‌కార్ట్‌ గ్లోబల్‌ జర్నీ ప్రారంభమైందని, ప్రస్తుతం ఈ-కామర్స్‌ మార్కెట్లో చోటు చేసుకున్న ఈ కొనుగోలు, టెలికాం మార్కెట్‌ కొనుగోలు లాంటిది కాదని పీపుల్‌స్ట్రాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పంకజ్‌ బన్సాల్‌ అన్నారు. ఆన్‌లైన్‌ పరంగా ఫ్లిప్‌కార్ట్‌కు బలమైన టెక్నాలజీ ఉందని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివే అన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement