ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : అదిరిపోయే డీల్స్ | Flipkart Big Saving Days Sale June 2020 Kicks Off | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : అదిరిపోయే డీల్స్

Jun 23 2020 8:43 PM | Updated on Jun 23 2020 8:48 PM

Flipkart Big Saving Days Sale June 2020 Kicks Off - Sakshi

సాక్షి, ముంబై :  ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ విక్రయాలను ప్రారంభించింది. నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు స్పెషల్  సేల్ కొన‌సాగ‌నుంది.  ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై  అనేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఐదు రోజుల అమ్మకాల్లో వివిధ ఉత్పత్తులపై 'అత్యల్ప ధరలను' అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది.  శాంసంగ్, ఆపిల్ ఐ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకు అందిస్తోంది. 

అలాగే క్రెడిట్ , డెబిట్ కార్డుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జతకట్టింది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయన్ని కూడా అందిస్తోంది. ల్యాప్‌టాప్‌ల‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఇంకా ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌, బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్‌, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు  త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ‌ర్లు రాయితీలు, ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. 

సోనీ బ్రావియా 65 అంగుళాల 4 కె స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 63 శాతం తగ్గింపుతో 97,999 రూపాయలకే లభ్యం (ఎంఆర్‌పి  2,64,900 రూపాయలు). హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు  10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.  పాత టీవీ మార్పిడి ద్వారా మరో 7,000 రూపాయలు తగ్గింపు. 

ఐఫోన్ ఎక్స్ ఎస్ 64జీబీ 
ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఎస్ 64 జీబీ 58,999కే లభ్యం. అసలు ధర  62,999 రూపాయలు. పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే అదనపు తక్షణ తగ్గింపుగా 13,950 రూపాయలు. 

వివో జెడ్ 1 ఎక్స్ 
వివో జెడ్ 1 ఎక్స్ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్)  16,990 రూపాయలు (ఎంఆర్‌పి 24,990 రూపాయలు)  పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే అదనపు డిస్కౌంట్‌గా 13,950 రూపాయలు. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. 

గూగుల్ పిక్సెల్ 3 ఏ
ధర : 29,999  రూపాయలు. (ఎంఆర్‌పి రూ .39,999)
శాంసంగ్
గెలాక్సీ ఏ80 (8జీబీ+128జీబీ స్టోరేజ్)  రూ.30వేల త‌గ్గింపు ధ‌ర‌తో 21,999 రూపాయలకు ల‌భ్యం

సాన్సుయ్ 55 అంగుళాల 4 కె క్యూఎల్‌ఇడి స్మార్ట్ టీవీ
ధర 42,999  రూపాయలు. (ఎంఆర్‌పి  72,590 రూపాయలు).  పాత టీవీని మార్పిడి చేసినప్పుడు 7,000 రూపాయలు  డిస్కౌంట్‌

కానన్ ఇఓఎస్ 3000 డి డిఎస్‌ఎల్‌ఆర్ 
బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 18,999  రూపాయలు. (ఎంఆర్‌పి 29,495 రూపాయలు)

Advertisement
 
Advertisement
Advertisement