ఆ సెక్టార్ '8 లక్షల కోట్ల' టైమ్ బాంబు | Failure of debt-laden telecom operators can trigger defaults: Bankers to government | Sakshi
Sakshi News home page

ఆ సెక్టార్ '8 లక్షల కోట్ల' టైమ్ బాంబు

May 26 2017 3:19 PM | Updated on Sep 5 2017 12:03 PM

టెలికాం సెక్టార్ పై బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ముంబై : టెలికాం సెక్టార్ పై బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.  భారీ ఎత్తున్న రుణాలు పొందిన టెలికాం రంగ వైఫల్యం పరిశ్రమలో డిఫాల్టర్ గా మారబోతుందంటూ ప్రభుత్వానికి టాప్ భారతీయ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. టెలికాం పరిశ్రమ రుణాలు 8 లక్షల కోట్లగా ఉన్నాయని, ఇవి ఓ టైమ్ బాంబుగా బ్యాంకులు అభివర్ణించాయి. ఈ రంగానికి బ్యాంకులు ప్రత్యక్షంగా రూ.2.63 లక్షల కోట్లను ఇవ్వగా, రూ.3.09 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ పేమెంట్లను టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించకుండా వాయిదా వేసినట్టు బ్యాంకులు పేర్కొన్నాయి. ఆపరేటర్స్ కాంట్రాక్ట్స్ పై ఆధారపడిన థర్డ్ పార్టీ రుణాలు సుమారు రూ. 1.8 లక్షల కోట్లగా ఉన్నట్టు బ్యాంకులు టెలికాం సెక్రటరీకి నివేదించాయి. దీనికి అదనంగా వార్షిక మూలధన ఖర్చులు రూ.35వేల కోట్లూ ఉన్నాయి.
 
ఇన్ని కోట్ల రుణాలు కలిగిన టెలికాం సెక్టార్ వృద్ధి మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదని బ్యాంకులు పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి టెలికాం సెక్టార్ వార్షిక వృద్ధి మొత్తంగా 25 శాతం తగ్గి రూ.1,31,000 కోట్లను నమోదుచేయనుందని బ్యాంకులు అంచనావేస్తున్నాయి. 20 శాతం ఆపరేటింగ్ మార్జిన్లతో సర్వీసులు అందజేయడానికి సరియైన ఫండ్స్ ను బ్యాంకులు పొందలేవని బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే బ్యాంకులకు పేమెంట్లు చెల్లించడంలో డిఫాల్టర్స్ గా మారుతున్నాయని టెలికాం కార్యదర్శికి ఇచ్చిన ప్రజెంటేషన్ లో బ్యాంకులు పేర్కొన్నాయి.
 
టెలికాం కంపెనీలు తమ రుణ సమస్యను భరించడానికి, ఈ సెక్టార్ కు కొంత పన్ను రిలీఫ్ ను అందించాలని బ్యాంకులు ప్రతిపాదిస్తున్నాయి. విలీనాలు, కొనుగోళ్లలో ప్రభుత్వాల నిబంధనలు సరళతరంగా ఉండాలని కూడా కోరాయి.  తక్కువ స్పెక్ట్రమ్ వాడక ఛార్జీలు, లైసెన్సు ఫీజులు, పన్నులను ప్రభుత్వాలు తక్కువగా ఉంచాలని కూడా పేర్కొన్నాయి. స్పెక్ట్రమ్ లను సెక్యురిటీ కింద కంపెనీలు వాడితే, బ్యాంకులు రుణాలను అందించగలవని తేల్చిచెప్పాయి. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement