మహిళా ఉద్యోగులు రెట్టింపు

Facebook Recruit More Women Employees in Fice Years - Sakshi

అయిదేళ్లలో ఫేస్‌బుక్‌ ప్రణాళిక  

శాన్‌ ఫ్రాన్సిస్కో: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే నల్లజాతి వారు, లాటిన్‌ అమెరికన్‌ ఉద్యోగుల సంఖ్యను సైతం రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. సిబ్బందిలో వైవిధ్యాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఈ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు సంస్థ చీఫ్‌ డైవర్సిటీ ఆఫీసర్‌ మాక్సిన్‌ విలియమ్స్‌ తెలిపారు. 2024 నాటికి తమ సిబ్బందిలో సగభాగం ఉద్యోగుల్లో మహిళలు, లాటిన్‌ అమెరికన్‌ దేశస్తులు, దివ్యాంగులు మొదలైన వారు ఉండనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం మొత్తం సిబ్బందిలో మహిళల సంఖ్య 36.9 శాతంగా ఉంది. గతేడాది ఇది 36.3 శాతం. సీనియర్‌ లీడర్‌షిప్‌ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం నుంచి 32.6 శాతానికి పెరిగింది. సాంకేతిక విభాగానికి సంబంధించి మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 23 శాతం మేర ఉన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top