త్వరలో ఫేస్‌బుక్ మెసెంజర్ గేమ్స్ | Facebook Messenger Might Soon Feature Games | Sakshi
Sakshi News home page

త్వరలో ఫేస్‌బుక్ మెసెంజర్ గేమ్స్

May 20 2015 2:56 AM | Updated on Jul 26 2018 5:23 PM

త్వరలో ఫేస్‌బుక్ మెసెంజర్ గేమ్స్ - Sakshi

త్వరలో ఫేస్‌బుక్ మెసెంజర్ గేమ్స్

త్వరలోనే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో గేమ్స్‌ను...

న్యూయార్క్: మనం త్వరలోనే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో గేమ్స్‌ను ఆడుకోవచ్చు. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనాయి. ఫేస్‌బుక్ ఇదివరకే గేమ్స్‌ను డెవలప్ చేసే కంపెనీలతో మెసెంజర్ కోసం గేమ్స్ రూపొందించే చర్చలు జరిపింది. గేమ్స్ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ మెసెంజర్‌లో గేమ్స్ అనే ఊహ చాలా మందిని ఆక ర్షిస్తోంది. అధిక సంఖ్యాక ప్రజలు మెసెంజర్‌ను వినియోగిస్తున్నారు. కాబట్టి మెసెంజర్‌లో గేమ్స్ ఆడుకునే ఫీచర్‌ను పొందుపరిస్తే అది గేమ్స్ ఆడే చాలా మందికి ఉపయుక్తంగా ఉంటుంది.

ఇద్దరు గేమ్ ప్లేయర్ల మధ్య మెసెంజర్ ఒక వారధిగా పనిచేస్తుందా? లేకపోతే ఒక రు మాత్రమే ఆడే గేమ్స్‌ను ప్రవేశపెడుతుందా? అనే అంశాన్ని ఫేస్‌బుక్ నిర్ణయించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement