భారత్‌ వృద్ధి అంచనా యథాతథం | Expect Indian growth to pick up in 2017, 2018: IMF Read more at: http://economictimes.indiatimes.com/articleshow/59735466.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనా యథాతథం

Jul 25 2017 1:35 AM | Updated on Sep 5 2017 4:47 PM

భారత్‌ వృద్ధి అంచనా యథాతథం

భారత్‌ వృద్ధి అంచనా యథాతథం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) భారత వృద్ధి రేటును యథాతథంగా 7.2 శాతంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) భారత వృద్ధి రేటును యథాతథంగా 7.2 శాతంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈవో) అప్‌డేట్‌ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లూ కూడా భారత వృద్ధి రేటు చైనా కన్నా అధికంగానే ఉండనుంది.

 చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగాను, 2018లో 6.4 శాతంగాను ఉండగలదంటూ గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్‌ స్వల్పంగా పెంచింది. భారత వృద్ధి రేటు అంచనాలను గతంలో ఇచ్చిన స్థాయిలోనే యథాతథంగానే ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైనప్పటికీ.. ఇది ఊహించిన దానికన్నా అధికమేనని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement