తప్పనిసరైతేనే వ్యాపారాలకు గుడ్‌బై: సైరస్ మిస్త్రీ | Exits for Tata Group usually the last resort: Cyrus Mistry | Sakshi
Sakshi News home page

తప్పనిసరైతేనే వ్యాపారాలకు గుడ్‌బై: సైరస్ మిస్త్రీ

Oct 3 2016 2:06 AM | Updated on Sep 4 2017 3:55 PM

టాటా గ్రూపు కొన్ని వ్యాపారాల నుంచి వైదొలగడం పట్ల తానేమీ కలత చెందడం లేదని గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు.

న్యూయార్క్: టాటా గ్రూపు కొన్ని వ్యాపారాల నుంచి వైదొలగడం  పట్ల తానేమీ కలత చెందడం లేదని గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు. గత 20 ఏళ్ల కాలంలో టాటా గ్రూపు 40కు పైగా వ్యాపారాల నుంచి తప్పుకోవడంపై మాట్లాడుతూ.... చిట్టచివరికి తప్పనిస్థితిలో వ్యాపారం నుంచి వైదొలుగుతాం గానీ, స్వల్ప కాల దృష్టితో నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. టాటా జ్యుయెలరీ బ్రాండ్ తనిష్క్, ఐటీ విభాగం టీసీఎస్ టర్న్ ఎరౌండ్ అయ్యి, వృద్ధి చెందడానికి పట్టిన కాలాన్ని మిస్త్రీ ఉదాహరణలుగా పేర్కొన్నారు.

వీటి విషయాల్లో పట్టుదల, దీర్ఘకాల దృష్టి ఫలితాన్నిచ్చాయన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన సందర్భంగా మిస్త్రీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. టాటా గ్రూపు 20 ఏళ్లలో 40కు పైగా వ్యాపారాల నుంచి తప్పుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement