ఏపీజీవీబీకి నేషనల్ పేమెంట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ | Sakshi
Sakshi News home page

ఏపీజీవీబీకి నేషనల్ పేమెంట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్

Published Fri, Dec 25 2015 2:22 AM

ఏపీజీవీబీకి నేషనల్ పేమెంట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ)కు నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఎల్) నుంచి నేషనల్ పేమెంట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ లభించింది. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్(ఎన్‌ఎఫ్‌ఎస్) ఏటీఎం నెట్‌వర్క్‌కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్(ఆర్‌ఆర్‌బి) కేటగిరిలో ఈ అవార్డు లభించిందని ఏపీజీవీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.
 
  గాంధీ నుంచి తమ బ్యాంక్ చైర్మన్ వి.నర్సిరెడ్డి  ఈ అవార్డును స్వీకరించారని పేర్కొంది. తమ బ్యాంక్ జారీ చేసిన రూపే ఏటీఎం కార్డుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.214 కోట్ల విలువైన ఒక లక్షకు పైగా లావాదేవీలు జరిగాయని బ్యాంక్ చైర్మన్ నర్సిరెడ్డి పేర్కొన్నారు. బ్యాంక్ సౌకర్యాలు అందుబాటులో లేని 4,444 గ్రామాల కోసం 1,880 బిజినెస్ కరెస్పాండెట్స్(బ్యాంక్ మిత్ర)లను నియమించుకున్నామని తెలిపారు.
 

Advertisement
Advertisement