
బంజారా హిల్స్‌లో రాడిసన్ బ్లూ ప్లాజా, క్లాసిఫైడ్ హోటల్స్ - 5 స్టార్ కేటగిరీ కింద.. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు 2025 పొందింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందుకుంది.
టూరిజం ఎక్సలెన్స్ అవార్డును.. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ తరపున సౌత్ ఇండియా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ జోషి, రాడిసన్ బ్లూ ప్లాజా బంజారా హిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజర్షి భట్టాచార్జీ అందుకున్నారు. ఆతిథ్యంలో అత్యుత్తమ ప్రతిభ, అత్యుత్తమ సేవా నాణ్యత ఈ అవార్డు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉందని జోషి పేర్కొన్నారు.