దక్షిణాదిపై దృష్టిసారించిన ఎవరెస్ట్‌ | Everest, focused on the south | Sakshi
Sakshi News home page

దక్షిణాదిపై దృష్టిసారించిన ఎవరెస్ట్‌

Feb 3 2018 12:44 AM | Updated on Feb 3 2018 12:44 AM

Everest, focused on the south - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రూఫింగ్, సీలింగ్, వాల్, ఫ్లోరింగ్‌ వంటి ప్రీ ఇంజనీరింగ్‌ బిల్డింగ్‌ సొల్యుషన్స్‌ కంపెనీ ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించింది. నిర్మాణ సామగ్రి ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని ఇదింకా కొలిక్కి రాలేదని ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మనీష్‌ సంఘీ తెలిపారు.

శుక్రవారమిక్కడ ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ విభాగమైన స్టీల్‌ బిల్డింగ్‌ సొల్యుషన్స్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ గారాగ్‌æతో దేశంలోనే తొలిసారిగా ప్రీ ఇంజనీరింగ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) టెక్నికల్‌ మాన్యువల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పీఈబీ పరిశ్రమ రూ.5 వేల కోట్లుగా ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఈసారి 20 శాతం వృద్ధిని లకి‡్ష్యంచామని తెలిపారు.

గత ఐదేళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 50 లక్షల చ.అ.ల్లో పీఈబీ నిర్మాణాలను పూర్తి చేశామని.. ప్రస్తుతం మథర్‌సన్‌ సుమీ, సుందరం మోటార్స్, బ్రిటానియా, రిలయెన్స్‌ వంటి ఇతర కంపెనీల ప్లాంట్ల నిర్మాణ ప్రాజెక్ట్‌ ఆర్డర్లున్నాయని తెలిపారు. పీఈబీ నిర్మాణాలు త్వరిగతిన పూర్తవుతాయని, నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement