కార్గోలో 12 శాతం వృద్ధి: ఎస్సార్‌ పోర్ట్స్‌ | Essar Ports records 12% growth in cargo handling in Q1 | Sakshi
Sakshi News home page

కార్గోలో 12 శాతం వృద్ధి: ఎస్సార్‌ పోర్ట్స్‌

Jul 15 2017 2:10 AM | Updated on Sep 5 2017 4:02 PM

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్గో విభాగంలో 12 శాతం వృద్ధి సాధించామని ఎస్సార్‌ పోర్ట్స్‌ సీఎండీ రాజీవ్‌ అగర్వాల్‌ చెప్పారు.

విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్గో విభాగంలో 12 శాతం వృద్ధి సాధించామని ఎస్సార్‌ పోర్ట్స్‌ సీఎండీ రాజీవ్‌ అగర్వాల్‌ చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల్ని ఆయన శుక్రవారమిక్కడ విడుదల చేశారు. గతేడాదితో పోల్చి చూస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 19.62 మెట్రిక్‌ టన్నుల ఎగుమతులు సాధించామన్నారు.

థర్డ్‌ పార్టీ కార్గోలోనూ 60 శాతం పెరుగుదల కనిపించిందన్నారు.  హజారియా పోర్ట్‌ యూనిట్‌లో 26 శాతం, పారాదీప్‌లో 131 శాతం, విశాఖలో 21 శాతం వృద్ధి సాధించామన్నారు. ఇదే ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ముందుకెళతామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement