మాల్యాకు మరో షాకివ్వనున్న ఈడీ | Enforcement Directorate mulls selling Mallya's shares in UB | Sakshi
Sakshi News home page

మాల్యాకు మరో షాకివ్వనున్న ఈడీ

Aug 22 2017 8:38 PM | Updated on Sep 5 2018 1:38 PM

మాల్యాకు మరో షాకివ్వనున్న ఈడీ - Sakshi

మాల్యాకు మరో షాకివ్వనున్న ఈడీ

భారీ రుణ ఎగవేతదారుడు, లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాపై ఈడీ మరో షాక్‌ ఇవ్వనుంది.

న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారుడు, లిక్కర్‌ కింగ్‌  విజయ్‌ మాల్యాపై ఈడీ మరో షాక్‌ ఇవ్వనుంది. రెండు కంపెనీల్లో మాల్యాకు సంబంధించిన షేర్లను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యునైటెడ్‌ స్పిరిట్స్‌,  యూబీసీఎల్‌ కంపెనీల్లో షేర్ల అమ్మకాలపై దృష్టిపెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఈ రెండుకంపెనీల్లో  విజయ్‌ మాల్యా షేర్లను అమ్మేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది.. ఇందుకు  పీఎంఎల్‌ఏ కోర్టును అనుమతిని కోరనుంది. ఈ విక్రయం ద్వారా రూ. 17000 వందలకోట్ల నిధులను ఈడీ రాబట్టనుంది. వీటిని విచారణ పూర్తయ్యేంతవరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌  చెయ్యాలని భావిస్తున్నట్టు ఎకనామిక్స్‌   టైమ్స్‌ నివేదించింది.    డిసెంబర్‌ లో మాల్యానుదేశానికి తిరిగి రప్పించేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది.  కాగా  జూన్‌ 30, 2017 నాటికి విజయ్‌ మాల్యా యునైటెడ్‌ స్పిరిట్స్‌లో 0.01 శాతం వాటాను   యూబీసీఎల్‌ లో 8.08 శాతం  వాటానుకలిగి వున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement